నేటినుండి గజకేసరి రాజయోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులవుతారు!

జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ అనేక రాజయోగాలను ఏర్పరుస్తాయి. జూలై 14వ తేదీన కర్కాటకరాశిలో గురు చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. గజకేసరి రాజయోగంతో సంపదలు, కీర్తి వస్తాయి. ఇది శుభయోగం కావడం వలన ఆయా రాశులవారికి కలిసి వస్తుంది.

మేష రాశి

మేష రాశి జాతకులకు జూలై 14వ తేదీ నుండి అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. గజకేసరి రాజయోగం కారణంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఊహించని ధన లాభాలు వస్తాయి. అనారోగ్య బాధల నుండి ఉపశమనం కలుగుతుంది.

Gajakesari RajYoga will be formed with conjunction of Jupiter and Moon these zodiacs are lucky

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఉద్యోగంలో పదోన్నతులను చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వీరికి అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది.

సింహరాశి

సింహరాశి జాతకులకు గజకేసరి రాజయోగం కలిసి వస్తుంది. గజకేసరి రాజయోగం కారణంగా మీరు కెరీర్లో ఊహించిన స్థాయిలో మంచి అవకాశాలను పొందుతారు. వీరికి ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రులు, గురువు అండదండలతో మంచి అవకాశాలు పొందుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు గజకేసరి రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో గొప్ప విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా గజకేసరి రాజకీయంతో వీరికి అనుకూలంగా ఉంటుంది .పోటీదారులపైన పై చేయి సాధిస్తారు.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+