12ఏళ్ళ తర్వాత గజలక్ష్మీ రాజయోగం.. 2025లో వీరికి రాజభోగం, ఐశ్వర్యం!
వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. పరిమాణంలో చాలా పెద్దదైన గురుగ్రహం 12 సంవత్సరాలలో మొత్తం 12 రాశులలో సంచరిస్తుంది. అంటే గురు గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న గురుడు వచ్చే సంవత్సరం తన స్థానాన్ని మార్చుకొని మిధున రాశిలో సంచారం చేయబోతున్నాడు.
గజలక్ష్మీ రాజయోగం
జులై 2025లో శుక్రుడు బృహస్పతిని అనుసరిస్తూ మిధున రాశిలోకి వస్తున్నాడు. ఇక ఈ రెండు గ్రహాల కలయిక వల్ల 12సంవత్సరాల తర్వాత మిధున రాశిలో జూలై నెలలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. జూలై 26వ తేదీన బృహస్పతి ఉన్న మిధునరాశిలోకి శుక్రుడు సంచరించడం తోటి గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

తులారాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా తులా రాశి వారు మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో అదృష్టం తులా రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సాహోద్యోగుల మద్దతు లభిస్తుంది.
సింహరాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు కూడా వెళతారు.
మిధున రాశి
మిధున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం కలిసొస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. చేసే ప్రతి పనిలోనూ విజయాలు వరిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఇది మిధున రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications