గరుడ పురాణం: మరణానికి ముందు షాకింగ్ సంకేతాలు; చంద్రుడు ఇలా కనిపిస్తాడు!!
భూమి పైన పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. ఎంతటివారికైనా మరణం అనివార్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరణం అనేది ఒక శాశ్వతమైన సత్యం. అయితే చాలామంది మరణం గురించి భయపడుతూ ఉంటారు. చనిపోతామేమో అని బాధపడుతూ ఉంటారు. ఎప్పుడో సంభవించే మరణం గురించి బాధపడుతూ బ్రతికే కంటే, ఉన్నంతకాలం సంతోషంగా జీవించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు.
ఇక గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు, పునర్జన్మ, ఆత్మ, పాపాలు మరియు పుణ్యాలు ఇలా చాలా విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి తన మరణానికి ముందు కొన్ని సంకేతాలను కచ్చితంగా తెలుసుకుంటాడు.

ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు అతను తన దగ్గర తన పూర్వీకులు ఉన్నట్టుగా, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు. కలల్లో కూడా పూర్వీకులు వచ్చినట్టు కల కంటారు. మరణం సంభవించే ముందు వ్యక్తి నీళ్లలో తన నీడను చూడడం సాధ్యపడదు. ఎవరికైతే తమ నీడ తమకు కనిపించదో ఆ వ్యక్తి మరణానికి చేరువ అయినట్టు గరుడ పురాణం చెబుతుంది.
మరణానికి ముందు వ్యక్తి తన ముక్కును తాను చూడలేదని గరుడ పురాణం పేర్కొంది .గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే వ్యక్తి చంద్రుని చుట్టూ ఒక చీకటి వృత్తాన్ని చూడడం ప్రారంభిస్తాడు. లేదా చంద్రుడు ఆ వ్యక్తికి విచ్చిన్నంగా కనిపిస్తాడు. మరణానికి ముందు వ్యక్తి చంద్రుడిని గతంలోలాగా కచ్చితంగా చూడలేడు.
మరణానికి చేరువైన వ్యక్తి శరీరం నుండి ఒక వింత వాసన వస్తుంది. ఇది కూడా ఒక మరణ సంకేతంగా చెబుతారు. చేతి రేఖలు మారతాయి. కొన్ని రేఖలు మాయమవుతాయి. యమదూతలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరణానికి చేరువైన వారికి నాలుక కొద్దిగా వణుకుతుంధీ. ముక్కు, నోరు కాస్త గట్టిగా మారుతాయి. మరణం సంభవించినప్పుడు వ్యక్తి ఒక రహస్యమైన తలుపును చూడడం ప్రారంభిస్తాడు. కొంతమంది తమ చుట్టూ మంటలను కూడా చూస్తారని గరుడ పురాణం చెబుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications