12ఏళ్ళ తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలలో కొన్ని, కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి. ఇక 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర బుధ గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది .
2025లో లక్ష్మీ నారాయణ యోగం
లక్ష్మీ నారాయణ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 28వ తేదీ 2025న మీనరాశిలోకి సంచరిస్తున్నాడు. మే 31వ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలోనే సంచరిస్తాడు. ఇక బుధ గ్రహం ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 114 మీనరాశిలోకి ప్రవేశిస్తుంది.

12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో బుధ , శుక్రుల సంయోగం
అప్పటికే మీనరాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు బుధుడు కలిసి మీనరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగాన్ని 12 సంవత్సరాల తర్వాత ఏర్పరుస్తున్నారు ఈ ప్రత్యేక యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది.
మిధున రాశి
2025లో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం మిధున రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులు గా మారుతున్నారు. అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మిధున రాశి వారు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ఏ పని చేసిన విజయలక్ష్మి వరిస్తుంది.
కుంభరాశి
లక్ష్మీనారాయణ యోగం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారు కూడా లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఏ రంగంలో పనిచేసే వారికైనా ఈ సమయంలో మంచి పేరు వస్తుంది. లక్ష్మీనారాయణ యోగం కుంభరాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది.
మీనరాశి
మీనరాశిలో బుధుడు మరియు శుక్రుడి కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నదన్న విషయం తెలిసిందే. ఫలితంగా మీనరాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనిలో మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబం నుండి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications