ఘల్లుఘల్లుమని బంగారు గజ్జెలతో లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే...
వాస్తుతో మన జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. వాస్తు శాస్త్ర సహాయంతోనే మనం ఇంటి సానుకూల శక్తిని పెంచగలుగుతున్నాం. ప్రతికూల శక్తులను తగ్గించగలుగుతున్నామని చాలామంది నమ్ముతారు. అందుకే ప్రతిఒక్కరు వాస్తు ప్రకారం ఇంటిని కట్టుకుంటారు. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం చేయాల్సిన కొన్ని పనులు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఘల్లుఘల్లుమంటూ సంతోషంగా తిరుగుతుంది. ఆ కుటుంబానికి ఆనందాన్ని, శ్రేయస్సును, సిరిసంపదలను ఇస్తుంది.
లక్ష్మీ కటాక్షం కోసం తులసమ్మ ముందు ఇలా చెయ్యండి
ఇక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షించి మనలను కరుణిస్తుంది? అన్న విషయానికి వస్తే.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి రోజు తులసి పూజ చేయాలి. తులసికి నీటిని సమర్పించాలి. ఉదయం సాయంత్రం తులసి కోటముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసి లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాం. కాబట్టి ప్రతిరోజు తులసమ్మకు పూజ చేయడం ఎంతో మంచిది.

లక్ష్మీదేవి నడయాడాలంటే ఇల్లు ఇలా ఉండాలి
ఇక శుక్రవారం రోజు ఉపవాసం చేయడంతో పాటు లక్ష్మీ సూక్తం పారాయణం చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. మురికి ఎప్పుడు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంట్లో పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించాలి.
అరటి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం
లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు అరటి చెట్టుకు పూజ చేయాలి. ఇంట్లో సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, పిల్లజెల్లతో ఉండాలంటే అరటి చెట్టుకు పూజ చేయాలి. వీలైతే ప్రతి రోజు ఉదయాన్నే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించి, పూజ చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా వారి పైన ఉంటుంది.
లక్ష్మీ కటాక్షం కోసం ప్రధాన ద్వారం వద్ద ఇలా చెయ్యాలి
ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఇంటి ప్రవేశద్వారం వద్ద సాయంత్రం సమయంలో దీపాన్ని వెలిగించాలి. తద్వారా సానుకూల శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీదేవి కటాక్షానికి కారణమవుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కావాలనుకునేవారు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ప్రతి గదిలోను వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకుండా జాగ్రత్తపడాలి. చీకటి ఉన్నచోట లక్ష్మీదేవి నివసించదు.
ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటినుండి వెళ్ళదు
చీకటి ఇంటి ఆనందం మరియు శ్రేయస్సు పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఇంటిని ఎప్పుడూ వెలుగులతో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఈ చిన్న చిన్న వాసు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు. ఆమె కటాక్షం మనందరి పైన తప్పనిసరిగా ఉంటుంది.












Click it and Unblock the Notifications