బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులవారి నట్టింట్లో తిష్ట వేసే లక్ష్మీదేవి!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్ణీత సమయం తర్వాత రాశులను, నక్షత్రాలను మారుస్తాయి సూర్యుడు బుధుడు సెప్టెంబర్ 17వ తేదీన కన్యా రాశిలో సంయోగం చెందనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 10:58 నిమిషాలకు బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన తెల్లవారుజామున 1: 38 నిమిషాలకు సూర్యుడు కన్యా రాశిలోకి మారతాడు.

బుధాదిత్య రాజయోగం
సెప్టెంబర్ 17వ తేదీన కన్యారాశిలో బుధ సూర్యుల సంయోగం జరుగుతుంది. ఈ కలయిక జ్యోతిష్య పరంగా విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. బుధ సూర్యుల సంయోగంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా ఈ నెలలో అదృష్టవంతులు అయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.

Goddess Lakshmi will come near these zodiac signs with the Budhaditya RajYoga

సింహరాశి
కన్యారాశిలో ఏర్పడే బుధాదిత్య యోగం సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు అందుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. పాత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. సింహరాశి జాతకులు వివిధ కార్యకలాపాలలో పాల్గొంటారు.

కన్యారాశి
2025లో కన్యారాశిలో ఏర్పడే బుధ సూర్య సంయోగం వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయంలో మంచి గుర్తింపు వస్తుంది. వృత్తిపరమైన ప్రణాళికలు విజయవంతమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇచ్చిన ప్రాజెక్టులను సక్సెస్ చేస్తారు. పరీక్షలలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ సమయం అధికంగా ధనలాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చిక రాశి
కన్యరాశిలో బుధ సూర్య సంయోగం వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో వేగంగా కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. భార్యతో మంచి సమయం గడుపుతారు.

కుంభరాశి
కన్య రాశిలో సూర్య బుధ సంయోగం కుంభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మీరు జీవితం నుండి వివిధ సమస్యలను పరిష్కరించడానికి అనువైన సమయం. బుధాదిత్య రాజయోగం వీరికి అదృష్టాన్ని ఆకస్మిక ధన లాభాలను తెస్తుంది. కుంభరాశి వారి పని జీవితంలో పురోగతి ఉంటుంది. ఏ పని చేసిన వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ ధన లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+