కృష్ణాష్టమి నాడు ఈ ఆరు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం!!
హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నాము. శ్రీకృష్ణుడి శిశువు రూపాన్ని జన్మాష్టమి నాడు పూజిస్తారు. శ్రీ కృష్ణాష్టమి పర్వ దినాన ప్రతీ ఒక్కరూ అత్యంత భక్తి భావంతో క్రిష్ణయ్యను బాలరూపంలో పూజించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలో ఎనిమిదవ తిథిలో జన్మించారు.
కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, కృష్ణుడి కటాక్షం మనపై ఉంటుందని చెబుతారు. కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు వస్తే అదృష్టం వస్తుందని చెబుతున్నారు.శ్రీకృష్ణ జయంతి అయిన కృష్ణాష్టమి నాడు ఇంటికి తీసుకు రావలసిన వస్తువులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడు బాల రూపాన్ని ఇంటికి తీసుకొని రావాలి. కృష్ణాష్టమి రోజు ఆవుల బొమ్మలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం. కృష్ణాష్టమి పర్వదినాన పిల్లనగ్రోవిని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది.
చెక్క లేదా వెండితో చేసిన వేణువును ఇంటికి తెచ్చుకుంటే కలిసొస్తుంది. ఇంట్లో వేణువును ఉంచడం వల్ల సంపద, ఆనందం వెల్లివిరుస్తుంది. శ్రీకృష్ణుని కిరీటం పైన నెమలి ఈకలు ఉంటాయి. కృష్ణాష్టమి పర్వదినాన నెమలి ఈకలను ఇంటికి తెచ్చి పెట్టుకుంటే మంచిది. నెమలి ఈకల వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి, ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
అంతేకాదు శ్రీ కృష్ణాష్టమి నాడు వైజయంతి మాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. శ్రీకృష్ణుని పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. కృష్ణాష్టమి నాడు ఇంటికి వెన్నను తీసుకురావాలి. కృష్ణుడికి వెన్నను, పాలను సమర్పించాలి. అప్పుడే గోపాలుడు సంతోషించి మన కోరికలను తీరుస్తాడు.
కృష్ణాష్టమి నాడు ఇంట్లో ఆవు లేగదూడ విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టండి. ఇలా చేస్తే శ్రీకృష్ణుడి కరుణ ఆ ఇంటి కుటుంబ సభ్యులపైన కచ్చితంగా ఉంటుంది. కనుక కన్నయ్యకు ఇష్టమైన ఈ ఆరు వస్తువులను కృష్ణాష్టమి పర్వదినాన ఇంటికి తెచ్చుకుని చూడండి. మీకు తప్పకుండా అదృష్టం కలిసొస్తుంది నమ్మండి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications