2026లో ముఖ్య గ్రహాల మహా రవాణా.. వీరికే సంపదల ఖజానా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు చేసే మహా సంచారం కొన్ని రాశుల వారికి శ్రేయస్సును, సంపదలను కలిగిస్తున్నాయి. 2026 సంవత్సరంలో శని, గురువు, రాహువు, కేతువుల మహా సంచారం కారణంగా నాలుగు రాశుల వారి సంపద రెట్టింపు అవుతుంది.
2026లో ముఖ్య గ్రహాల మహా రవాణా
2026 సంవత్సరంలో గురువు సింహరాశిలో సంచరిస్తాడు. శని మీనరాశి లోనే 2026 లో కూడా కొనసాగుతాడు. ఇక రాహుకేతువులు మకర రాశి, సింహరాశిలోకి సంచారం చేస్తారు. ఈ సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2026 ముఖ్య గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు సంతోషంగా ఉంటారు. వీరికి ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి 2026 లో ముఖ్య గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారు కెరీర్ లో ఊహించని మార్పులను చూస్తారు. ఏ పని చేసిన వీరికి కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. పిల్లలు సంతోషంగా జీవిస్తారు.
తులారాశి
2026 లో తులా రాశి వారికి ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. తులారాశి వారు కెరీర్ లో ఊహించని మార్పులను చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. వివాహితులు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఇది తులా రాశి వారికి కలిసి వచ్చే కాలం.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులు 2026 లో ముఖ్య గ్రహాల సంచారంతో అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు వాహనాలు, ఇల్లు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది .ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications