మీ ఇంట్లో సంపదలు పెరగాలంటే ఈ మొక్కను జాగ్రత్తగా పెంచండి!
ఇల్లు, ఇంట్లో పెట్టుకున్న వస్తువులు మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే మొక్కల దగ్గరనుండి అన్నీ వాస్తు ప్రకారం ఉండాలి అప్పుడే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా మంది వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ వాస్తు నియమాలను మొక్కల విషయంలో పాటించరు. కానీ మొక్కల విషయంలో కూడా వాస్తుకు మంచి మొక్కలు ఏమిటి? వాటిని ఏ దిశలో పెట్టుకోవాలి అనేది తెలిసి ఉండాలి.
ఇంటికి అదృష్టాన్ని ఇచ్చే మొక్క కలబంద
ఇంటికి వాస్తును ఇచ్చే మొక్కలలో కలబంద ఒకటి. కలబంద మొక్క ను పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో సంపద వృద్ధి జరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల వారికి ఊహించని అదృష్టం పెరుగుతుంది. అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కూడా చెబుతున్నారు.

కలబందను సరైన స్థలంలో పెడితే సంపదకు లోటు ఉండదు
పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదని చెప్తారు. ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుందని చెప్తారు. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే సంపదకు, ఆనందానికి లోటు ఉండదని చెబుతున్నారు. జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే కలబంద మొక్కను సరైన దిశలో పెట్టి పెంచాలి.
ఇంటికి సానుకూల శక్తిని తీసుకువచ్చే కలబంద
కలబంద మొక్కను తూర్పు దిశలో నాటడం వల్ల మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు. కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే రోగాలు దూరమవుతాయని, ధనధాన్యాలకు కూడా లోటు ఉండదని చెబుతారు.
ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను పెడితే జరిగేదిదే
కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయంతో పాటు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు. జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటవచ్చని చెబుతున్నారు. అంతేకాదు పశ్చిమదిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శ్రేయస్సును, సంపదను ఇస్తుంది కలబంద
కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులను, ఇంట్లో చిరాకులను దూరం చేసుకోవాలంటే ఇంట్లో కలబంద మొక్క లను తెచ్చి సరైన దిశలో పెట్టండి. ఇంట్లో ప్రతికూలతలు తొలగించటం కోసం సాధ్యమైతే కలబంద మొక్కను తూర్పు, ఉత్తరం దిశలలోనే పెట్టండి. ఇది మీకు, మీ కుటుంబానికి శ్రేయస్సును, సంపదను తప్పకుండా తీసుకువస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications