2025లో ఈ రాశులవారికి గృహయోగం.. మాట తప్పమన్న ముఖ్య గ్రహాలు!
మనలో చాలామంది సొంత ఇంటి కోసం కలలు కంటూ ఉంటారు. అటువంటివారు సొంతింటి నిర్మాణం కోసం డబ్బులు సమకూర్చుకున్న, స్థలం కొనుగోలు చేసుకున్న ఒక్కోసారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల వారి కల సాకారం కాదు. అయితే 2025 సంవత్సరంలో జరుగుతున్న ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారి సొంతింటి కలను సాకారం చేయబోతున్నాయి. ఏ రాశుల వారు 2025 లో సొంతింటి కల సాకారం చేసుకోబోతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
2025 సంవత్సరంలో మేష రాశి వారికి ముఖ్య గ్రహాల సంచారం సొంతింటి కల నెరవేరేలా చేస్తుంది. ఈ సంవత్సరం మేష రాశి వారికి గృహ నిర్మాణాలకు అత్యంత అనుకూలమైన సంవత్సరం. శని కారణంగా మేష రాశి జాతకులకు 2025లో ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ గృహ యోగం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది.

వృషభరాశి
2025 సంవత్సరంలో వృషభ రాశి జాతకులు సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. అయితే మార్చి తరువాత మీరు గృహ సంబంధిత వ్యవహారాలను పెట్టుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయి. గృహ నిర్మాణ విషయంలో 2025 లో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది గ్రహాల సానుకూల వైఖరితో 100% మీ పనులు పూర్తవుతాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులు 2025 సంవత్సరంలో జనవరి నుంచి మే వరకు ఇంటికి సంబంధించిన పనులు మొదలు పెట్టకూడదు. మే నెల తర్వాత వీరు సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టవచ్చు. మే నెల తర్వాత మిధున రాశి వారి సొంతింటి కల సాకారం అవుతుంది. అన్ని గ్రహాల కనికరంతో మీ పనులు నిరాటంకంగా సాగుతాయి.
వృశ్చిక రాశి
2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సొంతింటి కల సాకారం అవుతుంది. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో కచ్చితంగా గృహ యోగాన్ని కలిగి ఉన్నారు. ఇంటి నిర్మాణం కోసం శ్రీకారం చుడితే మీకు ఎదురయ్యే సమస్యలన్నీ వాటికవే పరిష్కారమై మీకు మార్గం సుగమంగా మారుతుంది. అయితే మే నెల ద్వితీయార్థం నుండి మీరు ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టి శుభ ఫలితాలను పొందవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications