త్వరలో గురు ఆదిత్య రాజయోగంతో నక్కతోక తొక్కే రాశులివే!

గురువు, రవి కలిసి వృషభ రాశిలో గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. గ్రహ సంచారంలో ఈ గ్రహాల కలయికకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. మే 13వ తేదీ నుండి 25వ తేదీ వరకు వృషభ రాశిలో రవి గురువు కలవబోతున్నాయి. సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల ఏర్పడే గురు ఆదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశిలో గురువు రవి తన ధన స్థానంలో కలవడం వల్ల వీరికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. సమయానికి చేతికి రావలసిన డబ్బు వచ్చి చేరుతుంది. తండ్రి జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

Guru Aditya RajYoga will give luck and wealth to these zodiac signs in may

వృషభ రాశి
వృషభ రాశి వారికి గురువు రవి కలిసి ఏర్పరిచే గురు ఆదిత్య యోగం కారణంగా సొంతింటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. పనిచేసే చోట పదోన్నతులు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి లాభ స్థానంలో భాగ్య ధనాధిపతుల యుతి జరుగుతున్న కారణంగా వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో బిజీగా ఉంటారు.

సింహరాశి
సింహరాశి జాతకులకు దశమ స్థానంలో గురువు రవి కలుస్తున్న కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్ లకు ఛాన్స్ ఉంది. వృత్తి వ్యాపారాలలో డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి విజయాలు వరిస్తాయి. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు రవి, గురువు సప్తమ స్థానంలో కలవడం వల్ల అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు రవి, గురువు పంచమ స్థానంలో కలవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు వస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏ పని చేసిన వీరికి అనుకూలంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+