దీపావళికి ముందే గురుపుష్య యోగంతో మీ ఇంట సంపదల ప్రకాశం!
మరో మూడు రోజుల్లో అక్టోబర్ 24వ తేదీన పుష్య నక్షత్రం రాబోతుంది. ఈసారి పుష్య నక్షత్రం గురువారంతో కలిసి గురు పుష్య నక్షత్రంగా కనిపిస్తుంది. దీపావళికి ముందు గురు పుష్య నక్షత్రం కనిపించడం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన సంఘటనగా చెబుతారు. అయితే ఈ నక్షత్ర సమయంలో ఏర్పడే గురు పుష్య యోగం శుభ ఫలితాలను ఇస్తుంది.
గురు పుష్యా నక్షత్ర సమయం ఇదే
పుష్యా నక్షత్రం గురువార యుక్తంగా వచ్చిన వేళ ఆ సమయంలో అమృతయోగం ఏర్పడుతుందని ఎటువంటి కొత్త పనినైనా ప్రారంభించడానికి ఇది శుభ సమయమని చెబుతారు. దీపావళికి ముందు అక్టోబర్ మాసంలో కనిపించే గురు పుష్య నక్షత్రం అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11:30 నిమిషాలకు కనిపిస్తుంది. ఇది మళ్ళీ అక్టోబర్ 25న 12:30వరకు ఉంటుంది. ఇక ఈ సమయం లో ఏ పని చేసినా లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది.

ఆదివారం, గురువారం పుష్య నక్షత్రం స్పెషల్
ఇక గురు పుష్య నక్షత్రం సమయంలో లక్ష్మీనారాయణుల పూజ చేయడానికి విశేషమైన సమయం గా చెబుతారు. సాధారణంగా పుష్య నక్షత్రం ఆదివారం వస్తే రవిపుష్య నక్షత్రం గాను, గురువారం వస్తే గురు పుష్య నక్షత్రం గానూ చెబుతారు ఈ రెండు రోజులలో పుష్య నక్షత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందని చెబుతారు.
కొత్త పనులు ప్రారంభానికి మంచి సమయం
ఇక పుష్య నక్షత్రానికి అధిపతి గురువు కావడంతో గురు పుష్య నక్షత్రానికి చాలా విశేషమైన స్థానం ఉంటుందని చెప్తారు. గురు పుష్య నక్షత్రం వేళ ఏ పని చేసినా అది ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్ర సమయం మంచి సమయం అని చెబుతారు.
ఈ సమయంలో పెళ్ళిళ్ళు మంచిది కాదు
కార్యాలయాలు ప్రారంభించే వారికి, కొత్తగా ఒప్పందాలు చేసుకునే వారికి, గృహ నిర్మాణాలు చేసుకోదలుచుకున్న వారికి ఈ సమయంలో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని లాభాల పంట పండుతుందని చెబుతారు గురు పుష్య నక్షత్ర సమయంలో అమృత యోగం ఏర్పడుతుందని ఇది ఏ పని ప్రారంభించడానికి అయినా శుభ సమయమే కానీ ఈ సమయంలో వివాహ కార్యక్రమాలు మాత్రం చేపట్టకూడదని చెబుతారు.
మహా విష్ణువు, లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే ఫలితాలు
దీపావళికి ముందు అక్టోబర్ 24వ తేదీన కనిపించే గురు పుష్య నక్షత్రం నాడు శ్రీమహావిష్ణువుని పూజించి అరటి చెట్టు మొదట్లో నీరు, శనగపప్పు సమర్పించాలని చెబుతారు. శ్రీమహావిష్ణువుకి, లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలని, తులసిమాలని సమర్పించాలని చెబుతారు. ఎవరైతే ఈ నక్షత్ర సమయంలో లక్ష్మీనారాయణుల పూజ చేస్తారో వారికి సంపద వృద్ధి చెందుతుందని చెప్తారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications