సెప్టెంబర్ 24 నుండి ఈ రాశుల వారికి కష్టాలు, నష్టాలు జాగ్రత్త!!
సెప్టెంబర్ 24వ తేదీ నుండి గ్రహాల ముఖ్య పరిణామాలు కొన్ని రాశుల వారికి కష్టాలు, నష్టాలు కలిగిస్తుంది. వివిధ గ్రహాల సంచారం, వివిధ రాశులలో తిరోగమనం, దహనం కావటం, ప్రత్యక్షం కావటం వంటివి కొన్ని రాశులకు అదృష్టాన్ని, దురదృష్టాన్ని కలిగిస్తాయి. ఈనెల 24 వ తేదీన కన్యారాశిలో కుజుడు దహనం అవుతాడు. కన్య రాశిలో కుజుడు దహనం కావడం నాలుగు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
కన్య రాశిలో కుజుడు దహనం వృషభరాశి వారికి అనేక కష్టాలు, నష్టాలకు కారణం అవుతుంది. వృషభ రాశి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్ట పడాల్సి ఉంటుంది. వారి తెలివితేటలను ఉపయోగించి ఎంత కష్టపడినా నిరాశాజనంకంగా ఫలితం ఉండవచ్చు. ఉద్యోగంపై ఆసక్తిని కోల్పోయి, ఉద్యోగం మారడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి. వ్యాపారం నిరాశజనకంగా ఉండవచ్చు. కొన్నిసార్లు నష్టాలు కూడా ఎదురుకావచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి సమస్యలను కూడా ఎదుర్కొనవలసి రావచ్చు.

సెప్టెంబర్ 24 నుండి కన్య రాశిలో కుజుడు దహనం వల్ల మేషరాశి వారు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి వృత్తులలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్య రాశిలో కుజుడు దహనం అవుతున్న సమయంలో వృత్తులకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకున్నా, వ్యవహారాలు చేసిన జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్ట పడినప్పటికీ అందుకు తగిన ప్రతిఫలం రాదు. అధికారుల నుండి కష్టానికి తగిన గుర్తింపు రాదు. ఉద్యోగులు, వ్యాపారాలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కన్య రాశిలో కుజుడి దహనం వల్ల సెప్టెంబర్ 24 నుండి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి వారు ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాలు రావు. వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగ బదిలీలు ఇబ్బంది పెడతాయి. పనిలో సహ ఉద్యోగులతో విభేదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఉద్యోగాలు చేసే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది.
సెప్టెంబర్ 24 నుండి కన్య రాశిలో కుజుడు దహనం కర్కాటక రాశి వారికి కష్టాలను, నష్టాలను కలిగిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక ఇబ్బందులు పడతారు. పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతాయి. ఉన్నతాధికారుల మద్దతు లభించకుండా పోతుంది. వ్యాపారం లోను మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. పోటీదారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపార ఒప్పందాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది.
సెప్టెంబర్ 24 నుండి కన్యా రాశిలో కుజుడు దహనం వల్ల ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాలను పొందుతారు. వ్యాపార వర్గాలు నష్టాలను చూసే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశిలో కుజుడు దహనం ధనస్సు రాశి వ్యాపార వర్గాలకు సవాల్ గా ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపార భాగస్వాముల తోనూ ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications