ఇంటి ఆవరణలో తేనెపట్టు.. ఏ దిశలో ఉంటే లక్ష్మి!
తేనె పట్టు... ఇంటికి సమీపంలో ఉంటే మంచిదా కాదా? తేనె పట్టు ఉంటే అది ఏ దిశలో ఉండాలి? ఏ దిశలో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది? ఎక్కడ ఉంటే అదృష్టం వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
తేనే తుట్టె ఏ దిశలో ఉంటే మంచిది?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి ఏ విధంగా అయితే నియమాలు ఉంటాయో, ఇంట్లో మొక్కలు పెట్టడానికి కూడా అదే విధంగా నియమాలు ఉంటాయి. అంతేకాదు ఇంట్లో పెట్టే వస్తువుల స్థానాలకు, మన ఇంటి చుట్టు పరిసరాలలో పక్షులు పెట్టే గూళ్ళకు, తేనెటీగలు పెట్టే తుట్టెలకు కూడా అలాగే నియమాలు ఉంటాయి. ఏ దిశలో ఉంటే మంచిది? ఏ దిశలో ఉంటే మంచిది కాదు? అనేది తెలుసుకోండి.

తేనెపట్టు నైరుతిలో ఉంటే ఏమవుతుంది?
ఇక తేనెపట్టు ఇంటికి పెడితే మంచిదా కాదా? ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్ల మీద పెడితే మంచిదా కాదా? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. ఇంటి ఆవరణలో తేనెపట్టు ఉండాల్సిన దిశలో ఉంటే మంచిది. నైరుతి దిశలో తేనెపట్టు ఉంటే మంచిది కాదు. సహజంగా నైరుతి దిశ పితృదేవతల దిశ. అటువంటి పితృదేవతల దిశలో తేనెపట్టు ఉంటే మంచిది కాదు. ఇది అరిష్టంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీనిని సాధ్యమైనంత త్వరగా తొలగించాలి.
ఈ దిశలలో తేనెపట్టు ఉంటే ఇంటికి లక్ష్మి
ఆగ్నేయంలో తేనె పట్టు ఉంటే మంచి గానీ, చెడు గాని పెద్దగా తేడాలు ఉండవు. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది .తేనెపట్టు వాయువ్య దిశలో ఉంటే చాలా మంచి జరుగుతుంది. వాయువ్యంలో ఉంటే ధన, ధాన్యాలు సిద్ధిస్తాయి. ఏ పని చేసినా లాభాలు వస్తాయి. తూర్పు భాగంలో ఉంటే కూడా మంచి జరుగుతుంది. తూర్పున తేనె పట్టు ఉంటే శత్రువుల పైన విజయం సాధిస్తారు అనుకున్న పనులలో సానుకూలతలు వస్తాయి.
ఈశాన్యంలో తేనెపట్టు ఉంటే జరిగేదిదే
ఇక ఉత్తరం వైపు తేనె పట్టు ఉన్న మంచి జరుగుతుంది ఉత్తరం వైపు తేనె పట్టు ఉంటే సుఖంగా జీవిస్తారు. ఇక ఈశాన్యం వైపు తేనే పట్టు ఉంటే అనేక కష్టాలు వచ్చి పడతాయి. ఇంటికి మధ్య భాగంలో తేనె పట్టు ఉంటే అధిక ధన నష్టం జరుగుతుంది. కనుక ఈ విషయాలను గుర్తించి కుటుంబానికి నష్టాన్ని చేకూర్చే దిశలో తేనెపట్టు ఉంటే వెంటనే తొలగించండి. అదృష్టాన్నిచ్చే తేనె పట్టును ఆస్వాదించండి.
disclaimer: ఈ కథనం వాస్తు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications