మార్చినెలలో మీనరాశిలో శుక్ర చంద్రుల యుతి.. వీరికి తిరుగులేని ఖ్యాతి!
జ్యోతిష శాస్త్రంలో నవ గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇవి వివిధ రాజ యోగాలను అరుదైన కలయికలను సృష్టిస్తాయి. ఇక మార్చి నెలలో శుక్రుడు మరియు చంద్రుడు అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తోంది. శుక్రుడు మార్చి రెండవ తేదీన తెల్లవారుజామున ఒంటిగంటకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
శుక్ర చంద్రుల యుతి.. అదృష్ట రాశులు
26వ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలోనే ఉంటాడు. ఇక మార్చి 18వ తేదీన రాత్రి 11గంటలకు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 21వ తేదీ తెల్లవారుజామున 2గంటల వరకు చంద్రుడు అక్కడే ఉంటాడు. ఇది మీనరాశిలో చంద్రుడు మరియు శుక్రుడి కలయికను సూచిస్తుంది. ఈ కలయిక కొన్ని రాశులవారిపైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఆ రాశులు అపారమైన సంపదలను చూస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనస్సు రాశి
శుక్రుడు మరియు చంద్రుని యొక్క యుతి ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంయోగం ధనుస్సు రాశిలో నాలుగవ గృహంలో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో కెరీర్ పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి తల్లితో సంబంధం బలంగా మారుతుంది..
కర్కాటక రాశి
శుక్రుడు మరియు చంద్రుని యుతి కర్కాటక రాశి జాతకులకు సానుకూలంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశిలోని అదృష్ట గృహంలో జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు అదృష్టం వస్తుంది. ఏదైనా పనులు కానీ, వ్యాపారాలు కానీ చేసేవారు మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలలోనూ, ,శుభకార్యాలలోనూ పాల్గొంటారు.
మకర రాశి
శుక్రుడు మరియు చంద్రుని యుతి మకర రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కలయిక మకర రాశిలో మూడవ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల మకర రాశి జాతకులకు ధైర్య సాహసాలు పెరుగుతాయి. మకర రాశి వారు ఆదాయాన్ని పెంచడానికి నూతన మార్గాలు తెరవబడ్డాయి. రుణ సంబంధిత ఆందోళనలు కూడా తగ్గుతాయి. వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో అవగాహన మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు పనిలో కొత్త బాధ్యతలను చూస్తారు. తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications