శ్రావణ మాసంలో నోములు, వ్రతాల వెనక దాగివున్న రహస్యాలు

మన సంస్కృతిలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఈ మాసాన్ని నోములు, వ్రతాలకే పరిమితం చేసి చూస్తాం. కానీ ఈ పవిత్ర మాసం వెనుక చాలామందికి తెలియని లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు రావడం వెనుక ఒక జ్యోతిష్య రహస్యం ఉంది. పౌర్ణమి నాడు చంద్రుడు 'శ్రవణా' నక్షత్రంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది.

'శ్రవణం' అంటే శ్రద్ధగా వినడం అని అర్థం. ఈ మాసంలో పవిత్రమైన మంత్రాలను, దైవిక విషయాలను ఎంత ఎక్కువగా వింటే, మనస్సు అంత ప్రశాంతంగా మారుతుంది. అంతేకాక, శ్రవణా నక్షత్రం శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో ఈ సమయంలో చేసే ధ్యానం, జపం నేరుగా పరమాత్మను చేరుతాయని విశ్వసిస్తారు.

శ్రావణ శుక్రవారాలవల్ల ఉపయోగం ఏంటి?
శ్రావణ శుక్రవారాలవల్ల ఉపయోగం ఏంటి?
Horoscope The secrets hidden behind the rituals and vows observed during the month of Shravana

భేదాలను తుడిచిపెట్టే రహస్యం

ఆధ్యాత్మికంగా శైవ, వైష్ణవ భేదాలను తుడిచిపెట్టే రహస్య సందేశం శ్రావణంలో దాగి ఉంది. సాధారణంగా శివుడు, విష్ణువు ఆరాధనలు వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ, శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు పరమ శివుడికి, శ్రావణ మంగళ, శుక్ర, శనివారాలు లక్ష్మీదేవికి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. "హరి అన్నా, హరుడు అన్నా ఒక్కటే" అనే అద్వైత భావనను లోకానికి చాటిచెప్పే ఏకైక దివ్యమైన మాసం ఇది. పురాణాల ప్రకారం లోక కళ్యాణం కోసం శివుడు హాలాహలాన్ని (విషాన్ని) మింగిన ఘట్టం ఈ మాసంలోనే జరిగింది.

దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసింది ఈ శ్రావణంలోనే. సముద్ర మథనంలో వెలువడిన ఘోరమైన విష జ్వాలలను లోక రక్షణ కోసం శివుడు తన గొంతులో బంధించాడు. ఆ విషపు తీవ్రమైన వేడి నుంచి శివుడిని శాంతింపజేయడానికి దేవతలంతా ఆయనకు గంగా జలంతో అభిషేకం చేశారు. ఆ సంఘటనకు గుర్తుగానే శ్రావణ మాసంలో శివలింగానికి నీటితో, పాలతో అభిషేకాలు చేసే ఆచారం పుట్టుకొచ్చింది.

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం కాకుండా ఇంకా ఏమేం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది?
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం కాకుండా ఇంకా ఏమేం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది?

ఆరోగ్య రహస్యం ఉంది

శ్రావణ మాసంలో పాటించే నియమాల వెనుక అద్భుతమైన సైంటిఫిక్, ఆరోగ్య రహస్యం ఉంది. ఈ మాసం వర్షాకాలంలో రావడం వల్ల వాతావరణంలోని తేమ కారణంగా మనుషుల్లో జీర్ణశక్తి చాలా మందగిస్తుంది. ఈ సమయంలో వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికే పెద్దలు శ్రావణంలో వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం, మాంసాహారాన్ని వదిలేసి శాకాహారం మాత్రమే తీసుకోవడం అనే నియమాలను ఆధ్యాత్మికతతో జోడించి ఆచారంగా మార్చారు.

ప్రకృతిని దైవంగా భావించి పూజించే రహస్యం కూడా ఇందులో ఉంది. వర్షాల వల్ల ప్రకృతి పచ్చని పైరుతో, కొత్త కళతో వికసిస్తుంది. ప్రకృతి అలా కళకళలాడటమే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అందుకే ఇళ్లను శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలు కట్టి, లక్ష్మీదేవిని (వరలక్ష్మి వ్రతం రూపంలో) ఆహ్వానిస్తారు. శ్రావణ మాసం అంటే కేవలం పూజలు మాత్రమే కాదు... ప్రకృతితో మమేకమై, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించే ఒక గొప్ప జీవన విధానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+