Horoscope today: నేడు బుధుడి గమనంలో మార్పు.. వీరి పంట పండుతుంది!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రోజుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. నేడు డిసెంబర్ ఆరవ తేదీ 2025 సంవత్సరం శనివారం. ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రాశుల వారికి నేడు కలిసి వస్తుంది? ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఫలితాలు ఉంటాయి? ఈ రోజు వృశ్చిక రాశిలో బుధ సంచారం జరుగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి జాతకులు ఈరోజు పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధ్యమవుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగ స్థితిలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో మంచి పరిస్థితులు కనిపిస్తాయి.
మిధున రాశి
మిధున రాశి జాతకులు పని విషయంలో నూతన అవకాశాలను చూస్తారు. చదువులో కూడా సానుకూలతను చూస్తారు. అయితే ఈరోజు నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు కర్కాటక రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
సింహరాశి జాతకులు ఉద్యోగంలో, వృత్తిలో కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబంలో నిలకడ అవసరం.
కన్యారాశి
కన్య రాశి జాతకులకు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. మానసికంగా వీరికి అలసటగా ఉంటుంది. ఆరోగ్యంపైన శ్రద్ధ వహించండి.
తులారాశి
తులారాశి జాతకులు స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తారు. తులా రాశి వారి వ్యక్తిగత జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఉద్యోగంలోనూ, వ్యక్తిగత జీవితంలోని బాగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు .ఈరోజు త్వరిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏ పని చేసిన ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు కలిసివస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులకు ఇది మంచి అవకాశం.
మకర రాశి
మకర రాశి జాతకులు నేడు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి పని చేస్తే చక్కని ఫలితం వస్తుంది. కుటుంబ సమన్వయం చేసుకోవడం మకర రాశి వారికి నేడు అవసరం.
కుంభరాశి
కుంభ రాశి వారు ఈ రోజు కొత్త ఆలోచనలు, ప్రణాళికలు మొదలుపెట్టడానికి అనుకూలమైన సమయం. నేడు వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూలతలు కనిపిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు ప్రశాంతంగా ఉండే రోజు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కుటుంబం తోను, స్నేహితులతోనూ సమయం గడిపితే మంచిది.












Click it and Unblock the Notifications