చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు..సెప్టెంబర్ 11లోపు ఈ రాశులే మహారాజులు
జ్యోతిష్య శాస్త్రంలో సంపద, వైభవం, విలాసాలు, ప్రేమ మరియు సౌందర్యానికి అధిపతిగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే తన నక్షత్రాన్ని మార్చుకోబోతోంది. ఆగస్టు 25, 2026 మధ్యాహ్నం 12:00 గంటలకు శుక్రుడు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ నక్షత్ర సంచారం సెప్టెంబర్ 11, 2026 వరకు కొనసాగనుంది. గ్రహాల రాశి, నక్షత్ర మార్పులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో చిత్రా నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి రాజయోగం పట్టి, ఊహించని ధనలాభాలతోపాటు అదృష్టం వరించబోతోంది. అదృష్టం వరించే ఆ రాశులు ఇవే.
మేష రాశి
మేష రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సమాజంలో హోదా, ప్రశంసలు దక్కుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి లాభాలు ఊపందుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభించి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

వృషభ రాశి
శుక్రుడి నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి తిరుగులేని పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు జీతాల పెంపు, పదోన్నతులు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవితంలో కీలకమైన, సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
తులా రాశి
తులా రాశి జాతకులకు ఈ కాలం అత్యంత శుభప్రదంగా మారనుంది. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. కార్యాలయంలో అధికారుల నుంచి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఆదాయం పెరగడంతో అనుకున్న విలువైన వస్తువులు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించి ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో సదరు రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా, ప్రేమ, వ్యక్తిగత సంబంధాల్లో ఉన్న వివాదాలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి.














Click it and Unblock the Notifications