వాస్తు: ఇంట్లో వస్తువులను ఎలా అమర్చుకోవాలి?

Posted By:
Subscribe to Oneindia Telugu

వస్తు రూపేణ వాస్తు అన్నారు పెద్దలు. వాస్తురీత్య ఇల్లు కట్టుకున్నప్పటికిని వస్తువులను అమర్చుకునే విషయంలో అంతగా శ్రద్ధచూపం. ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం మా జాతక గ్రహస్థితి బాగుంది,ఇల్లు వాస్తుప్రకారమే ఉంది. అయినా ఏందుకు మాకీ ఇబ్బందులు వస్తున్నాయి, అని వాపోతుంటారు.దానికి కారణం వాస్తుశాస్త్ర ప్రకారం మనకు ఉన్న మొత్తం ఇంటి స్థలంలో ఎక్కడ ఏమి నిర్మించుకోవాలి.

ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఏ దిశలో ఉంటే మంచిది అనే ప్రశ్నకు వాస్తు శాస్త్ర సూచనలను పరిశీలిద్దాం.శాస్త్రరిత్య సూచించిన స్థానాలలో ఇంటికి ఉపయోగకరమైన వస్తువులను సరైన స్థలంలో అమర్చుకో గలిగితే సిరి సంపదలు , ఆనంద,ఆరోగ్యకరమైన జీవన విధానం ఏర్పడుతుంది.

How to arrange articles in the house?

మనకు దిక్కులు నాలుగు అవి తూర్పు,పడమర,ఉత్తరం దక్షిణం అలాగే విదిక్కులు నాలుగు అవి ఈశాన్యం,ఆగ్నేయం,వాయువ్యం.నైఋతి.ఈ అష్టదిక్కుల అధిపతులకు సంబంధించిన వస్తుసామాగ్రిని మన ఇంట్లో ఆయా నిర్ధిష్ట స్థలాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరుగుతుంది. అవి ఏమిటో దిక్కుకులు,విదిక్కుల వారిగా గమనిద్దాం.

తూర్పుదిశలో :-టివి,డివిడి ప్లేయర్స్, రేడియో,షోకోరకు పెట్టుకును బొమ్మలు,వస్తువులకు అనుకూల స్థానం.

ఆగ్నేయంలో:- వంట సంబంధితమైన వస్తువులు,పోయ్యి మొదలగునవి.వంట చేస్తున్నప్పుడు మన ముఖం తూర్పు వైపునకు చూస్తున్నట్లు స్టవ్ ను ఏర్పాటు చేసుకోవాలి.వంట గది సైజ్ 8'X10' ఉంటే మంచిది.ఇంటి ఆగ్నేయ దిశ స్థలంలో లెట్రిన్,బాత్ రూమ్ లు నిర్మించు కోవచ్చును.(ఎట్టి పరిస్థితులలో కూడా ఆగ్నేయంలో పడకగదిని ఏర్పాటు చేసుకోకూడదు)

ఆగ్నేయ - దక్షిణ మద్యభాగంలో:- నూనెలు,గ్యాస్ సిలెండర్,కిరోసిన్ డబ్బాలు పెట్టుకోవాలి.

దక్షిణంలో:- పిల్లల,గేస్ట్ లకోరకు రూమ్ ఏర్పాటు చేసుకోవాలి.ఇంటి దక్షిణ దిశ స్థలంలో లెట్రిన్,బాత్ రూమ్ లు నిర్మించు కోవచ్చును.

నైరుతిలో:-డబ్బులు దాచుకునే బీరువాలు,ఇనుప పెట్టెలు నైరుతి గదిలో నైరుతి మూల,తూర్పు లేక ఉత్తరంనకు అభిముఖంగా ఉండునట్లు ఏర్పాటు చేసుకోవాలి, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది,ఇంటి ఆవరణ నైరుతి భాగంలో ఇనుప సామాను,గృహరక్షణ కోరకు వినియోగించు వస్తువులు ఉండాలి.

నైరుతి-పడమర మధ్యలో:-పిల్లల చదువులు,పెద్దలు మాట్లాడు కునుటకు మీటింగ్ హాల్ నకు అనుకూలం.హాల్ సైజ్16'X10' ఉన్నచో మంచి సంభాషణలు జరుగ గలవు.

పడమరలో:- భోజనం చేయు స్థలం (డైనింగ్)ఇక్కడ బోజనం చేస్తే ఆయుస్సు వృద్ధి అగుతుంది.ఇంటి పడమర దిశ స్థలంలో లెట్రిన్,బాత్ రూమ్ లు నిర్మించు కోవచ్చును.

పడమర-వాయువ్యము మధ్యలో:- శబ్ధం వచ్చే వస్తువులు ,రోలు,గ్రైండర్,వాషింగ్ మిషన్,ఏర్ కూలర్ మొదలగునవి ఉండే స్థలం.

వాయువ్యంలో:- చీపురు,చెత్తడబ్బ,పనికిరాని వస్తువులను భద్రపరచుకును స్థలం.

వాయువ్యం-ఉత్తరం మధ్యలో:-భార్య భర్తల పడక స్థలం ఈ గది కొలత 10'X11' సైజ్ లో ఉంటే అనుకూలం.ఇంటి వాయువ్య స్థలంలో లెట్రిన్,బాత్ రూమ్ లు నిర్మించు కోవచ్చును.

ఉత్తరం దిశలో:- బంగారు వస్తువులు,డబ్బాలు మొదలగునవి ఉంచినచో ధన లాభం కలుగుతుంది.

ఈశాన్యంలో పూజ చేసుకొను స్థలం. పూజాగది కొలత 6'X6' ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.ఇంటి ఈశాన్య భాగంలో బోరు,బావి,సంపు మొదలగు లోతుగా ఉండే నీటి నిర్మాణానికి సంబంధించినవి ఏర్పాటు చేసుకోవాలి(బోరు,బావి అనేవి ఇంటి ఈశాన్య మూలలో 45 డిగ్రీలలో పడకుండా జాగ్రత్త పడాలి,అలా ఉంటే కష్టాలపాలు అవుతారు)ముఖ్య విషయం ఎట్టి పరిస్థితులలో కుడా ఇంటి ఈశాన్య భాగంలో వంట చేయుట పనికిరాదు.

ముఖ్యంశాలు:- రోలుకు పోయ్యికి మధ్య నడక లేకుండా రోలును ఏర్పాటు చేసుకోవాలి. ఒక వేళ ఇలా ఉంటే ఇంట్లో గోడవలు ఏర్పడతాయి.

చీపురును పట్టుకునే భాగం భూమికి ఆనించి నిలబేడితే ఇంట్లో అనేక సమస్యలు కష్టాలు కలుగుతాయి. కావున ఈ శాన్యం మూలన తప్ప ఎక్కడైన డోర్ వెనక భాగంలో కనబడకుండా మేకుకు తగిలించండి.ఇల్లు చిమ్ముటకు(తుడవటడం) ఈశాన్య ప్రాంతం నుండే ప్రారంభించాలి.

అనుభవజ్ఞులైన వాస్తు పండితుల సలహాలు తీసుకుని వస్తువుల అమరిక చేసుకోవడం ఉత్తమం. మనకు దిక్కులు విదిక్కులు తెలిసినంత మాత్రన సరిపోదు.ఎందుకంటే ఇంటి వాస్తు పధకంనకు సరిపడ కోలతల విషయంమై వాస్తు అనుభవజ్ఞులు దిక్కులతో పాటు డిగ్రీలను ఇంటి ఎత్తు,పల్లాలలు మరియు ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోని సలహాలు ఇవ్వడం జరుగుతుంది కావున వారి సూచనలను పాటించడం ఉత్తమం.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explined the arrangement of articles in the house according to vasthu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి