అల్లు అర్జున్ 'రాకా'.. సంచలన విషయాలు బయటకు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విజువల్ వండర్ 'రాకా'.. పుష్ప ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో సెన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కెరీర్ లోనే తొలిసారిగా త్రిబుల్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి నెగెటివ్ షేడ్ తో ఉన్న క్యారెక్టర్ కాగా మిగతా మూడు విభిన్నమైన గెటప్స్ తో ఉంటుందని సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం మిన్నల్ మురళి ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమాల్లో రాకా ఒకటి కావడం విశేషం. అయితే ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్న విషయం తెలిసిందే. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

AlluArjun and Atlee s Raaka Writer Nagendra Kashi Drops Sensational Details on the Visual Wonder

ఇక తాజాగా ఈ సినిమా గురించి రైటర్ నాగేంద్ర కాశీ సంచలన విషయాలు తెలిపారు. రాకా మూవీ కేవలం ఒక సాధారణ సినిమా కాదని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్‌ మార్క్ మూవీగా నిలిచిపోతుందని అన్నారు. ఇప్పటివరకు భారతీయ వెండితెరపై ఎవరూ ఊహించని విధంగా.. ఎన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త అద్భుతమైన ప్రపంచాన్ని డైరెక్టర్ అట్లీ సృష్టిస్తున్నారని అన్నారు. 'రాకా' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌ లో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ లేకుండానే తాము గూస్ బంప్స్ కు గురయ్యామని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+