• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైశాఖమాసంలో లక్ష్మీనారాయణ స్వామిని ఎలా ఆరాధించాలి..? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది..?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కర్తీకము ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది.

వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు.

వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం నారాయణుని తులసితో ఆరాధించడం చేయాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి సమర్పిస్తే శ్రేష్టం అని ధర్మశాస్త్రం చెప్తున్నది.విష్ణు సహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది. అనునిత్యం కూడా అశ్వత్థ 'రావి' వృక్షానికి సమృద్ధిగా నీళ్ళు పోసి ప్రదక్షిణలు చేయడం వైశాఖం అంతా చేసినట్లయితే అభీష్ట సిద్ధి లభించడమే కాక పితృదేవతలు తృప్తి చెందుతారు అని పెద్దలు అంటారు.

How should the spiritual practice be in Vaisakha month?

గళంతిక ఆరాధన శివునకు ఈ మాసమంతా అభిషేకం చేస్తే చాలా ప్రసిద్ధి. అను నిత్యం శివారాధన అభిషేకంతో చేయాలి. అది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతినిస్తుంది. అందుకు శాంతి కోసం శివునికి అభిషేకం చేస్తారు. శివాలయాలలో శివునకు పైన గళంతికను ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. దీనినే దారాపాత్ర అంటారు. నిరంతరం శివుడి మీద ధార పడేటట్లుగా ఒక పాత్రను ఏర్పాటు చేయాలి. ఇలా నేలంతా శివునిపై ధార పడేటట్లు చేసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని ధర్మశాస్త్రములు చెప్తున్న విషయం.

వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.

వైశాఖమాస స్నాన సంకల్పము :-

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |

నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||

వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |

తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||

వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |

మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||

మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |

ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||

ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా /గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, ఉత్తరాయనే, వసంతఋతౌ, వైశాఖమాసే, ....పక్షే , ....తిధౌ, ......వాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్ధాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వే షాంపాపానాం అపనోద నార్ధంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్ధం, కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్ధం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్ధం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే.

సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము:-

గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||

పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి

మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్దం ప్రకల్పయ ||

అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం

స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||

విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం

వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||

అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ

భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||

త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా

యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||

యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః

సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||

నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా

విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ ||

భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ

ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే

స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||

సమస్త జగదాధార శంఖచక్ర గదాధర

దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||

నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే

నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||

మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ

ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||

స్నానం తరువాత ప్రార్థనా శ్లోకాలను చదువుతూ ప్రవాహానికి యెదురుగా వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరానికి చేరి కట్టు బట్టలను పిండుకోవాలి, తరువాత మడి, పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం గంధం, విభూతి, కుంకుమ వగైరాలని ధరించి సంధ్యా వందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన, గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను.

వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |

అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||

గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |

ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||

ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |

గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||

దానమంత్రం :-

ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ అహం .....గోత్ర, .....నామధేయ ఓం ఇదం వస్తుఫలం (దానంయిచ్చే వస్తువుని పట్టుకొని) అముకం సర్వ పాపక్షయార్థం, శుభఫలావాప్త్యర్థం అముక ......గోత్రస్య(దానం పుచ్చుకొనేవారి గోత్రం చెప్పాలి) ప్రాచ్యం/నవీనందదామి అనేన భగవాన్ సుప్రీతః సుప్రసన్నః భవతు దాత దానము నిచ్చి అతని చేతిలో నీటిని వదలవలెను.

దాన పరిగ్రహణ మంత్రం :-

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.

పురాణ ప్రారంభమున వైష్ణవులు చదువదగిన ప్రార్థనా శ్లోకములు :-

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ||

యత్ర యోగీశ్వరః కృష్ణః యత్రపార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిః మతిర్మమ ||

లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః

యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ||

అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ

ఆ కర్ణపూర్ణ ధన్వానౌ రక్షతాం రామలక్ష్మణౌ ||

సన్నద్ధః కవచీఖడ్గీ చాపబాణధరోయువా

గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతుసలక్ష్మణః ||

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ ||

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యమ్

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ||

ఉల్లాస పల్లవితపాలిత స్పతలోకీం నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం

శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః ||

పురాణము ముగించునప్పుడు చదువదగిన ప్రార్థనా శ్లోకములు :-

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ||

వందేలక్ష్మీం పరశివమయీం శుద్దజాంబూనదాభాం

తేజోరూపాం కనకవసనాం స్వర్ణ భూషోజ్జ్వలాంగీం ||

బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానాం

ఆద్యాంశక్తీం సకలజననీం విష్ణువామాంకసంస్థాం ||

కుంకుమాంకితవర్ణాయ కుందేందు ధవళాయచ

విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః ||

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయాంతాం న్యాయ్యేన మార్గేణ మహీంమహీశాః

గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

కాలేవర్షతు పర్జన్యః పృధివీసస్యశాలినీ

దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||

స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః

సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మికః ||

సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః

సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః

అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

పురాణ ప్రారంభమున శైవ సాంప్రదాయము వారు చదవవలసిన ప్రార్థనా శ్లోకములు ;-

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే ||

వందే శంభు ముపాపతీం సురుగురం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతిం ||

వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం ||

తప్త స్వర్ణవిభా శశాంకమకుటా రత్నప్రభాభాసురా

నానావస్త్ర విరాజితా త్రిణయనాభూమీరమాభ్యాం యుతా ||

దర్వీహాటక భాజనం చదధతీరమ్యోచ్చపీనస్తనీ

నృత్యంతం శివ మాకలయ్య ముదితాధ్యేయాన్నపూర్ణేశ్వరీ ||

భవానీ శంకరౌవందే శ్రద్దా విశ్వాసరూపిణో

యాభ్యాంవినాన పశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం ||

ఉక్షం విష్ణుమయం విషాణకులిశంక రుద్ర స్వరూపంముఖం

ఋగ్వేదాది చతుష్టయంపద యుతం సూర్యేందు నేత్ర ద్వయం ||

నానాభూషణ భూషితం సురనుతం వేదాంత వేద్యంపురం

అండం తీర్థమయం సుధర్మ హృదయం శ్రీనందికేశంభజే ||

పురాణం ముగించునపుడు చదవదగిన ప్రార్థనా శ్లోకములు :-

సాంబోనః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం

సాంబం స్తౌమిసురాసురోగగణాః సాంబేన సంతారితాః ||

సాంబాయాస్తు నమో మయావిరచితం సాంబాత్ పరంనోభజే

సాంబస్యామ చరోస్మ్యహం మమరతిః సాంబే పరబ్రహ్మణి ||

ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం

ఆగమవిపిన మయూరీం ఆర్యామంతర్వి భావయే గౌరీం ||

యశ్శివోనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయ మంగళం ||

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

మహాదేవస్య సేవార్థమనుజ్ఞాం దేహిమే ప్రభో ||

వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగంమహోన్నతం

ఘంటాంగళే ధారయంతాం స్వర్ణరత్న విభూషితం

సాక్షాద్ధర్మ తనుందేవం శివవాహం వృషంభజే ||

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీంమహీశాః

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యంలోకా స్సమస్తాస్సుఖినోభవంతు ||

కాలేవర్షతు పర్జన్యః పృధివీ సస్యశాలినీ

దేశోయంక్షోభరహితో బ్రహ్మణాస్సంతు నిర్భయాః ||

స్వకాలే భవితావృష్టిః దేశోస్తునిరుపద్రవః

సమృద్ధా బ్రాహ్మణాస్సంతు రాజాభవతు ధార్మిక ||

సర్వేచ సుఖినస్సంతు సర్వేసంతునిరామయాః

సర్వేభద్రాణి పశ్యంతు నకశ్చిత్ పాపమాప్నుయాత్ ||

అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః

అధనాస్సధనాస్సంతు జీవంతు శరదాంశతం ||

English summary
The Vaisakha month is one of the most wonderful months for spiritual practice. Vaisakha, Magha and Karthika are all very important in spiritual practice. However, in the same way as the Kartika Purana and the Magha Purana, the Vaisakha Purana was also written by Vyasadeva. This month is in every way favorable for spiritual attainment. It can be defined as the practice month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X