విజయ్ మార్క్ నిర్ణయం, మిత్రపక్షాలకు షాక్.. ఢిల్లీ కేంద్రంగా..!!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తన ముద్ర నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే... తన పార్టీ బలోపేతం దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం నడుపుతున్న విజయ్.. క్రమంగా వారి పైన పట్టు బిగిస్తున్నారు. చెన్నైలో తన నిర్ణయాలకు బ్రేకులు వేస్తున్న వారికి ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయించే వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా విజయ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో విజయ్ ఆచి తూచి స్పందిస్తూ వచ్చారు. ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో జరిగే తిరుచ్చితో పాటుగా అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. అయిదు మిత్రపక్షా పార్టీలు చెన్నై లో విజయ్ నిర్ణయాలను నిశితంగా గమినిస్తూ.. స్పందిస్తున్నాయి. కొన్ని నిర్ణయాల పైన ఓపెన్ గా వెల్లడిస్తున్న అభిప్రాయాలతో విజయ్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. ఢిల్లీ కేంద్రంగా విజయ్ రాజకీయం మొదలు పెట్టారు. అందులో భాగంగా తన వ్యక్తిగత జ్యోతిషుడు రాధాన్ పండిట్‌ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం రాజ్యసభను వీడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాధాన్‌ను రాజ్యసభకు పంపించాలని విజయ్ భావిస్తున్నట్లు తెలిసింది.

విజయ్ రాజకీయంగా కీలక అడుగులు
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రాధాన్ పండిట్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విజయ్.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించు కొన్నారు. ఈ నేపథ్యంలో పండిట్‌ను రాజ్యసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. టీవీకేకు అసెంబ్లీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మిత్రపక్షాలతో కలిపి అధికార కూటమి సంఖ్య 121గా ఉంది. దీంతో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. రాధాన్ పండిట్ నియామకం పైన మిత్రపక్షాల నుంచి అభ్యంతరాలు రాకుండా.. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించినట్లు సమాచారం. విజయ్ తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా తిరుచ్చి తో పాటుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నాలుగు స్థానాల్లోనూ విజయం సాధించి తన ఎమ్మెల్యేల సంఖ్యా బలం క్రమంగా మెజార్టీ దిశగా తీసుకెళ్లేందుకు విజయ్ వ్యూహాలను అమలు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications