Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వృషభరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

 How will this Ugadi year be for the people who hold Taurus as Zodiac sign

వృషభ రాశి:- కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభరాశికి చెందుతారు.

వృషభరాశి వారికి ఈ సంవత్సరం

ఆదాయం - 02 - వ్యయం - 08,

రాజపూజ్యం - 07 - అవమానం - 03.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు దశమస్థానమైన ( కుంభం) లో రజితమూర్తిగా ఉంటాడు.

తర్వాత నవంబర్ 20 వరకు తామ్ర మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా ... తొమ్మిదో స్థానమైన ( మకరరాశి )లో రజితమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 1, 7 స్థానాలైన ( వృషభ, వృశ్చిక ) రాశులలో తామ్రమూర్తులుగా ఉంటారు.

* గురువు ఉగాది నుండి 19 నవంబర్ 2021 వరకు అశుభ స్థానం వలన - తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.

 How will this Ugadi year be for the people who hold Taurus as Zodiac sign

ముఖ్యంగా శారీరక సమస్యలుతో తరచుగా బాధించును.

జీవితంలో అనుభవిస్తున్నయోగం చెడిపోతుంది.

స్వయం కృతాపరాధం వలన కొన్నితప్పులు చేసి నష్టాలను కొని తెచ్చుకుంటారు .

ఏ ప్రయత్నం చేసినా కూడా మానసికంగా సంతృప్తి అనేది కనబడదు.

19 నవంబర్ 2021 వరకు కొత్తగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది.

20 నవంబర్ 2021 నుండి వృషభరాశి వారికి గురువు యోగించి శుభఫలితాలు ఇస్తాడు.

వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశములు కలుగుతాయి,

స్వయం ఉపాధి చేసుకునే వారికి విశేష లాభాలు కలుగుతాయి.

విద్యార్థులకు అనుకూలమైన సమయం.

తీర్ధ యాత్ర ప్రయాణములు 20 నవంబర్ 2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు.

సాంప్రదాయ బద్దమైన జీవితం ప్రారంభించడానికి అత్యంత అనుకూల కాలం.

విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు.

* శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు .

నూతన వాహన కోరిక నెరవేరును.

వారసత్వ సంపద లభించును.

పనిచేస్తున్న రంగములలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు.

వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉంటే .. ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభింస్తుంది.

అనుకున్నఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు.

వ్యక్తిగత ఎవరి జాతకంలో శని స్వక్షేత్రంలో ఉన్నను

లేదా ఉచ్చ స్థితి ఉన్ననూ

లేదా మూల త్రికోణములో ఉన్నవారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు.

వీరు తమ వంశానికి, జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే .. సత్కార్యములు చేస్తారు.

* రాహువు - కేతువుల వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

సమాజంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు.

ఉద్యోగులకు కోరుకున్న విధంగా స్థాన చలనం కలుగుతుంది.

పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోవును.

కొంత శారీరకంగా అనారోగ్యం సమస్యలను మాత్రం ఎదుర్కొంటారు ,

వైవాహిక జీవతంలో తీవ్ర గొడవలు ఏర్పడే సూచలు ఉన్నాయి,

వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

గోచార గ్రహస్థితి వలన అనేక బరువు భాద్యతలు మోయవలసి వస్తుంది.

తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచిస్తున్నాయి .

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.

సర్పదోషాలు, గ్రహాల దోషాలు ఉన్నవారు తగు నివారణ చేసుకోండి.

వివాహయోగం ఉంది.

వృత్తి, వ్యాపారాలలో ఆర్ధిక పురోగాభివృద్ది బాగుంటుంది.

విదేశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది.

ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

ఇంటి విషయాలు పట్టించుకోకుండా, వ్యసనాలకు బానిసై ఇంట్లో అశాంతి సృష్టిస్తున్న జీవిత భాగస్వామి మీద విసుగు పుడుతుంది,

ఇది అందరికీ వర్తించదు .. వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఫలితం ఉంటుంది.

ఆరోగ్య సమస్యలు ఉంటాయి. రోజు యోగాసనాలు, ధ్యానం చేయుట వలన కుదుటపడుతాయి .

ముఖ్యమైన విషయాలలో పెద్దల మాట వినడం శ్రేయష్కరం అని గ్రహించండి .

తల్లిగారి వైపు వంశ సూతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.

వ్యవసాయ దారులకు సామాన్య లాభం కలుగుతుంది, కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఉపాద్యాయులకు సన్మానం , తోటి ఉద్యోగులతో మంచి మిత్రుత్వం ఏర్పడుతుంది.

రాజకీయ నాయకులకు అనుకూలం .. సెప్టెంబర్ లోగా ఏదైనా పదవి లభించే అవకాశం ఉంది.

విద్యార్ధులు చదువుపై ఎక్కువ కృషి చేయాలి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, గోమాతకు గ్రాసం పెట్టి .. పూజ చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+