భారీ ఖగోళ మార్పు.. నేటినుండి ఈ రాశులు నక్కతోక తొక్కుతున్నాయ్!
డిసెంబర్ 21వ తేదీ నేడు.. ఈ రోజు చాలా ఆసక్తికరమైన ఖగోళ మార్పు నేటి నుండి ప్రారంభం అవుతుంది. నేటి నుండి ఈ ఏడాదిలోనే అత్యంత తక్కువ పగలు సమయం, అత్యంత ఎక్కువ రాత్రి సమయం ఉండే రోజు మొదలవుతుంది. నేటి నుండి పగలు 8 గంటలు మాత్రమే ఉండనుంది. మిగిలిన 16 గంటలు రాత్రి ఉంటుంది. ఇలా ఈ రోజుని శీతాకాలపు అయనాంతంగా చెప్తారు.
ఈ రోజు ముఖ్యమైన ఖగోళ మార్పు
ఈరోజు భూమి తన చుట్టూ తాను నిటారుగా కాకుండా 23.5 డిగ్రీల కోణంలో వంగి సూర్యుని చుట్టూ తిరగటం వలన అనేక మార్పులు జరుగుతాయి . ఈ రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి ఎక్కువగా ఉండటం వలన చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది.

కొన్ని రాశులకు శుభాలనిచ్చే ఖగోళ మార్పు
ఉత్తర అర్ధగోళంలో సూర్యుని ఉత్తరాయణం శీతాకాలపు అయనాంతం నుండి అంటే నేటి నుండి మొదలవుతుంది. డిసెంబర్ 21 నుండి కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఈ ఖగోళ మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశులవారు అదృష్ట రాశుల వారిగా మారుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారికి నేటి నుండి చాలా శుభ ప్రదంగా ఉండనుంది. ఈ రోజు మేషరాశి జాతకులు ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది. వీరికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని పనులూ పూర్తవుతాయి. ఇది మేషరాశి వారికి అదృష్ట కాలం. ఇప్పుడు చేసిన ప్రణాళికలు అమలులో శుభ ఫలితాలను ఇస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది సింహరాశి వారికి వర్తక, వ్యాపారాలలో లాభాలను, సానుకూలతలను ఇచ్చే కాలం.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేటి నుండి జరుగుతున్న ఖగోళ మార్పు అన్ని విధాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశి వారు కొత్త ప్రాజెక్ట్ లలో విజయం సాధిస్తారు. సింహరాశి వారి పనులన్నీ పూర్తవుతాయి. సింహరాశి వారికి పురోభివృద్ధి కలుగుతుంది. వీరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేటి నుండి జరుగుతున్న ఖగోళ మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీరికి నేటి నుండి ఆర్ధిక స్థిరత్వం మొదలవుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది.
మీన రాశి
మీనరాశి వారికి నేటి నుండి సానుకూల ఫలితాలు రానున్నాయి. మీన రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. నేడు వీరిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇది అన్ని విధాలా మీనరాశి వారికి సానుకూలతలను తీసుకు వచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications