ఇంట్లో పితృదోషం ఉంటే ఈ సంకేతాలు.. నివారణకు ఇప్పుడే సరైన సమయం!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పితృ దోషం ఉంటే ఆ ఇంట్లో జీవించేవారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరైతే ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నారో వారు ఆ సమస్యలకు కారణం పితృ దోషమా అనేది తెలుసుకోవాలి. హిందూమతంలో మరణించిన పూర్వీకులను ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన వారిగా చెబుతారు. పూర్వీకుల యొక్క ఆత్మ సంతృప్తి చెందకపోతే, లేదా వారి కోరికలు నెరవేరకపోతే ఆ కుటుంబం పైన పితృ దోష ప్రభావం కనిపిస్తుంది.
పితృ పక్షాలలో పితృదోష నివారణ
ఈ దోషం కుటుంబంలో అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. అయితే ఇంట్లో పితృ దోషం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. వాస్తు శాస్త్రం, మత గ్రంథాలు ఆ సంకేతాలను గురించి వివరించాయి. మరి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుంటే, ప్రస్తుతం నడుస్తున్న పితృ పక్షాలలో పితృదోష నివారణ చేసుకోవచ్చు.

ఈ సంకేతాలు ఇంట్లో ఉంటే పితృ దోషం ఉన్నట్టే
ఇంట్లో తరచూ అశాంతి, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే ఆ ఇంట్లో పితృ దోషం ఉన్నట్టేనని చెబుతున్నారు. ఇంట్లో తరచూ కలహాలు, తగాదాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుంటే ఇది పితృ దోష సంకేతం అంటున్నారు. పండుగలు సంతోషకరమైన సందర్భాలలో కూడా విభేదాలు వస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రబలంగా ఉందని ఇది సూచిస్తుందని చెబుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే కూడా పూర్వీకులు అసంతృప్తితో ఉన్నట్టు
ఎలాంటి కారణం లేకుండా ఇంట్లో వాళ్ళు తరచూ జబ్బు పడుతుంటే, ఎవరో ఒకరు అనారోగ్యాన్ని ఎదుర్కొంటూ ఉంటే, ఇంటి గోడలలో పగుళ్లు రావడం, రావి చెట్టు పెరగడం జరిగితే, తులసి చెట్టు అకారణంగా ఎండిపోతే పితృ దోషం గా పరిగణించబడుతుంది. పూర్వీకుల అసంతృప్తి కారణంగా ఇంటి వాతావరణం ప్రతికూలంగా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.
పితృదోష నివారణకు చెయ్యాల్సిందిదే
ఈ పితృ దోషం నుండి బయటపడడానికి అనేక నివారణలు ఉన్నాయి. పితృ పక్షాలలో పూర్వీకుల ఆత్మశాంతికి పిండ ప్రదానం చేయడం, ఆహారం, బట్టలు, డబ్బు దానం చేయడం, హృదయపూర్వకంగా తెలిసి తెలియక చేసే తప్పులకు పూర్వీకులను క్షమాపణలు కోరడం పితృదోష నివారణకు మంచి నివారణలు. ఇది మాత్రమే కాకుండా వంటగదిలో చతుర్దశి నాడు, అమావాస్య నాడు సాయంత్రం వేళ నూనె దీపం వెలిగించి, ఒత్తిని దక్షిణం వైపు నుంచి పరిహారం చేస్తే పితృ దోషం నుండి విముక్తి కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications