దేవీ శరన్నవరాత్రులలో ఈ 5 కలలు వస్తే శుభసూచకం!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రులలో 9రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చే దుర్గామాత ను భక్తి శ్రద్దలతో పూజించిన వారికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ నవరాత్రులలో వచ్చే కొన్ని కలలు మనకు శుభ సంకేతాలు ఇస్తే మరి కొన్ని అశుభ సంకేతాలు ఇస్తాయి.
అయితే కొన్నిరకాల కలలు మాత్రమే దుర్గామాత అనుగ్రహానికి సంకేతంగా కూడా భావిస్తారు. ఆకలలు వచ్చిన వారు అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో గౌరవప్రదమైన జీవితం అనుభవిస్తారనేది పెద్దలు చెప్తున్నమాట. అయితే ఆ కలలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటిది కలలో దుర్గాదేవి విగ్రహం చూడటం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.ఈ కల మీకు దుర్గాదేవి అనుగ్రహం ఉంది అని సూచిస్తుంది. ఇక రెండవది.. మీకు కలలో సింహంపై స్వారీ చేస్తున్న దుర్గాదేవి దర్శనం ఇచ్చిందంటే జీవితంలో సానుకూల మార్పుల్ని సూచిస్తుందని అర్దం. ఇక కలలో వివాహ ఉపకరణాలు అంటే గాజులు, బిందులు, కుంకుమ లేదా ఎరుపురంగు వివాహ ఉపకరణాలను చూడటం వారి సమస్యల ముగింపునకు సంకేతంగా భావిస్తారు.
అలాగే కలలో ఏనుగును చూడటం లేదా ఏనుగుపై స్వారీ చేస్తున్న దుర్గాదేవిని చూడటం గొప్ప విజయానికి సంకేతంగా భావిస్తారు.చివరగా కలలో ఏవైన పాలు లేదా పాల ఉత్పత్తులు చూడటం వారు చేస్తున్నపనిలో విజయం సాధించడం లేదా సమాజంలో వారికి గౌరవం పెరగడానికి పంకేతంగా చూస్తారు. ఈ నవరాత్రులలో ఈ ఐదు కలలు కన్నవారికి దుర్గా మాత సంపూర్ణ అసుగ్రహం ఉంటుందనేది పెద్దల మాట.
ఐదు కలలు రాని వారికి కనీసం ఒక్క కల వచ్చినా వారి జీవితం ధన్యం అయినట్లే.. ఎందుకంటే ఈ 9రోజులలో కలలు రాకుంటే మళ్ళీ ఆ నవరాత్రుల కోసం ఏడాది కాలం వేచి చూడాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే భక్తితో అమ్మను కొలిచి ఆమె క్రుపకు పాత్రులు కండి. కలలో దుర్గాదేవి దర్శనంతో సానుకూల ఫలితాలు పొందండి.












Click it and Unblock the Notifications