హనుమాన్ జయంతి.. శనిదోష నివారణ, ఆర్ధిక సమస్యల నివారణకు ఇలా చెయ్యండి
త్వరలో హనుమాన్ జయంతి రాబోతుంది. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకమైన రోజుగా ఉండనుంది. ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం రోజు వస్తుంది. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి, ఆ రోజే హనుమాన్ జయంతి రావడం విశేషంగా చెప్పబడింది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము.
శనిదోష నివారణకు హనుమాన్ జయంతి నాడు ఈ పరిహారం
హనుమాన్ జయంతి రోజున శని దోషం తొలగిపోవడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అనేక ప్రత్యేక పరిహారాలు సూచించబడ్డాయి. ఈ పరిహారాలను చేసినట్లయితే శని దోషం పోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేస్తే, శని అశుభ ప్రభావాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది.

హనుమాన్ జయంతి నాడు దానాలు
హనుమంతుని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఆంజనేయుని ఆరాధించిన వారికి, ఆంజనేయుని అనుగ్రహం ఉన్నవారికి, శని అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి హనుమాన్ జయంతి రోజు శని దోషం పోవాలంటే మర్చిపోకుండా ఈ పనిని చేయండి. ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి హనుమాన్ జయంతి రోజు నిరుపేదలకు దానం చేయండి.
హనుమాన్ జయంతి నాడు సుందరకాండ పారాయణం
ఇలా దానధర్మాలు చేయడం వల్ల, ముఖ్యంగా అన్నదానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు హనుమాన్ జయంతి నాడు సుందరకాండ పారాయణం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది.
తమలపాకుల దండలు సమర్పిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి
ఆరోజు ఎవరైతే సుందరకాండ పారాయణ చేసి హనుమంతుని భక్తితో పూజించి హనుమంతుడికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, హనుమాన్ జయంతిని పాటిస్తారో వారి ఇళ్లలో పిల్లలకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. హనుమంతుడికి తమలపాకుల దండలు సమర్పిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications