2వ తేదీన ఇలా చేయండి.. జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది

శ్రావణ మాసం చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆరోజు కొన్ని విధివిధానాలు పాటిస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి సంపద కలుగుతుంది. ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం, తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు. జన్మజన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలంటే ఆరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.

గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి.
గ్రామ దేవతకు నిమ్మకాలయ దండ వేసినా, నిమ్మకాయ దీపాలు వెలిగించినా, కుంకుమ సమర్పించినా కష్టాలన్నీ తీరిపోతాయి.
ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరతాయి.
ఎద్దుకు బెల్లం ముక్క తినిపించినా లేదంటే బెల్లంతో తయారుచేసిన పదార్థాలు తినిపించినా దోషాలన్నీ తొలగిపోతాయి.
శివాలయంలో ప్రదక్షిణాలు మంచివి. సాయంత్రం పూట మూడు ప్రదక్షిణలు చేసినా మంచిది.

If you do this on Polala Amavasya day you will get wealth

శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతిచ అంటూ మూడు నామాలు చదవాలి.
కుటుంబ సభ్యులంతా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే రావిచెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు మహిళలు చేయాలి.
ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఖర్జూరం ఉంచి చేయాలి.
ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాటిని భక్తులకు పంచిపెట్టాలి. దీన్ని అమాసోమవార వత్రం అని కూడా పిలుస్తారు.

శ్రావణ మాసం బహుళ పక్షంలో వచ్చే తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పైన చెప్పిన విధంగా ఆచరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవడంతోపాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+