మీకు పునర్జన్మ వద్దా, ఏం చేయాలంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

సృష్టిలో మానవుడు సహజంగా అన్ని జీవరాసులలాగే పుట్టినప్పటికిని,భగవత్ ఆరాధన విషయంలో మాత్రం మానవునికి భక్తికి పై మెట్టు జ్ఞానం అవుతుంది.భక్తి, జ్ఞానం అనేది ఒకటి కాదు.మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం.మన కున్న కోరికలను భగవంతుడు తీరిస్తే మనల్ని దేవుడు కరునించాడని సంబరపడిపోతుంటాం.

కోరికలు తీరకుంటే నా ఖర్మ బాగాలేదు అనుకుని బాధపడతాం.మానవునుకి భక్తి భావం అనే విషయం నిజంగా చాలా గొప్పది.మనిషిలో భక్తిభావం కలిగింది అంటే మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నట్టే లెక్క. కేవలం భగవంతుడిని కొలవడానికే ఆ భక్తి పరిమితం కాకూడదు. భగవత్ ఆరాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్న విశిష్టత తెలుసుకోలేము. దైవం యొక్క మహిమను గ్రహించలేము. భక్తి ముక్తిదాయకమైనది అయితే దానికి పైనున్న మెట్టే జ్ఞానం.ఆత్మజ్ఞానం సాధించిన మనిషి ఋషి అవుతాడు.

If you don't want rebirth, do this

ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కాదు. మనగురించి మనం తెలుసుకోవడమే! మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్ళించుకోవటమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపలావణ్యాలను మాత్రమే కాక ఆయనచుట్టూ అలముకున్న దివ్యత్వాన్ని గ్రహించాలి.

ఆ దివ్యత్వంలో ఉపదేశాలు, ప్రబోధాలు కూడా భాగమై ఉంటాయి. వాటిని గ్రహించాలి. ఆ ఉపదేశాలలో ఆచరణయోగ్యమైన వాటిని ఆచరించాలి. ఆ ప్రబోధాలలోని నీతిని గ్రహించాలి. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మోక్షదాయకమవుతుంది.

అలా కాకుండా జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించక అజ్ఞానంతో బ్రతికితే మోక్షం సిద్ధించదు.నరుడే నారాయణుడు అని భావించి సాటి వారికి తన వంతుగా సహయపడాలి.అలా కాకుండా కేవలం స్వార్ధబుద్ధితో,బందు ప్రీతితో వ్యవహరిస్తే తిరిగి నీచమైన జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే ఏ ఆత్మ అయినా మనిషిరూపంలో జన్మిస్తుంది. ఆ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గాన్ని ఎంచుకోవడం మానవుల సత్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.

భగవంతుడు సృష్టించిన జీవజాలమేదీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి.భగవంతుని గుర్తించినవాడు కేవలం మానవుడు ఒక్కడే. అందుకే ఈ మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది.మనిషి తనకున్న జ్ఞానంతో వివేకంతో మసలుకొని భగవంతుని కీర్తనలు గానం చేస్తుంటే భగవంతుడు పరవశం చెంది,ఆ భక్తునికి వశుడవుతాడు. ఆధ్యాత్మికమార్గంలో పయనించడానికి సరైన గురువును ఎంచుకోవాలి.

శిష్యుడు గురువు చూపిన మార్గంలో నడవ గలగాలి. గురువు చెప్పిన నీతి సూత్రాలు ఆచరించాలి. ఈ ఆచరణలో ఉన్న సమయంలో ఎలాంటి సండేహాలు పనికిరావు. భగవంతుని మీద ఎటువంటి భక్తి శ్రద్ధలు చూపుతామో, ఆధ్యాత్మిక గురువు దగ్గర అదే భక్తిని ప్రదర్శించాలి.

అప్పుడే భగవదనుగ్రహం సులభతరమవుతుంది.మోక్షం సిద్ధిస్తుంది.గురువు చూపిన మార్గంలో శిష్యుడు తూచా తప్పకుండా ఆచరించిన నాడు ఆశిష్యునుకి సంపూర్ణ గురు కటాక్షం కలిగి మోక్షం సిద్ధిస్తుంది.అందుకే అంటారు గురువే దైవం,సర్వస్వం,గురు మహిమ అనిర్వచనీయమైనది,మహిమాన్వీతమైనది జై శ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If we don't want rebirth, Astrologer explained what shuold we do.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X