Secunderabad -Anakapalle: సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-షెడ్యూల్, హాల్ట్ లు ఇవే..!

తెలంగాణలోని సికింద్రాబాద్(Secunderabad) కూ, ఏపీలోని అనకాపల్లి (Anakapalle)కి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తోంది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ఈ రెండు స్టేషన్ల మధ్య నడుపుతున్న రైల్వే.. ఇప్పుడు ఓ రైలును క్రమబద్ధీకరిస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్, హాల్ట్ లు, ఇతర వివరాలను అధికారులు తాజాగా ప్రకటించారు.

Visakhapatnam – Kollam: విశాఖ-కేరళ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!
Visakhapatnam – Kollam: విశాఖ-కేరళ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!

సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రతీ ఆదివారం నడిచేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17043 ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాద్ లో ఆదివారం రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ రైలు అనకాపల్లికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది. అలాగే అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ కు ప్రతీ సోమవారం నడిచేలా మరో కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17044 ఈ నెల 18 నుంచి అందుబాటులోకి వస్తోంది. అనకాపల్లిలో సోమవారం సాయంత్రం 5.35కు బయలుదేరే ఈ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం ఉదయం 8.40కి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

Secunderabad to Anakapalle New Weekly Train Schedule Stops amp amp Departure Days Explained
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఈ రెండు రైళ్లకూ చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలిలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, 12 ధర్డ్ ఏసీ కోచ్ లు అందుబాటులో ఉంటాయి. వారం ప్రారంభంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నడిచేలా ఈ రైళ్ల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అలాగే తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా స్టాప్ లు కూడా ఇచ్చారు. దీంతో అనకాపల్లితో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు ఈ రైళ్లు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+