Anakapalle-Charlapalli: అనకాపల్లి-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ఏపీలోని అనకాపల్లి నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లికి (Anakapalle-charlapalli) రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్న రైల్వే.. ఇప్పుడు మరో కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించబోతోంది. ఈ రైలు ఎప్పటి నుంచి రాకపోకలు సాగించబోతోంది ?, హాల్ట్ లు, కోచ్ లు, ఇతర వివరాలను అధికారులు తాజాగా ప్రకటించారు. అవేంటో ఓసారి చూద్దాం..
అనకాపల్లి నుంచి చర్లపల్లికి ఇప్పటికే నడుపుతున్న ఎక్స్ ప్రెస్ రైలు 17054, అలాగే చర్లపల్లి నుంచి అనకాపల్లికి నడుపుతున్న ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17053ను ఇకపై వీక్లీ రైళ్లుగా నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని ప్రకారం అనకాపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు ప్రతీ శుక్రవారం నడిచేలా ప్లాన్ చేశారు. ఈ రైలు మే 8 నుంచి ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. అలాగే చర్లపల్లి నుంచి అనకాపల్లి రైలు ఈ నెల 14 నుంచి ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది.

చర్లపల్లి నుంచి గురువారం రాత్రి 10.10కి బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి మీదుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. అలాగే అనకాపల్లి నుంచి ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.35కు బయలుదేరి శనివారం ఉదయం 6.40కి చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ ఒక ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 15 ధర్డ్ ఏసీ కోచ్ లు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు.














Click it and Unblock the Notifications