ఈ శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే మీకు డబ్బే డబ్బు.. తెలుసుకోండి!!
పుట్టుమచ్చలు.. చర్మంపై చిన్న నలుపు లేదా గోధుమ రంగులో ఏర్పడే మచ్చలు. ఇవి జీవితంలో ఒక వ్యక్తి యొక్క అదృష్టాన్ని సూచిస్తాయి. మన శరీరం మీద, ముఖం మీద ఉండే పుట్టుమచ్చలు అనేక లోతైన అర్ధాలను కలిగి ఉంటాయి. పుట్టుమచ్చలు మీ జీవితాన్ని, భవిష్యత్తును బహిర్గతం చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని వీటిపై అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.
హిందూ విశ్వాసాల ప్రకారం శరీరంపై ఉన్న పుట్టుమచ్చ ఏ స్థానంలో ఉంది? ఎలా ఉంది? దాని ప్రభావం జీవితంపై ఏ విధంగా ఉంటుంది అనేది చెబుతారు. శరీరం పై పుట్టుమచ్చ ఎలా ఉందో దానిని బట్టి ఆర్థిక స్థితి, వ్యక్తిత్వం గురించి కూడా చెప్పొచ్చని చెబుతున్నారు. శరీర భాగాలలో కొన్నిచోట్ల పుట్టుమచ్చలు ఉంటే ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారని చెబుతున్నారు.

నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే మీకు డబ్బు సంపాదనకు లోటు ఉండదని, ఎక్కువ ప్రయాణాలు చేస్తారని చెబుతున్నారు. నుదుటికి ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటే డబ్బు విషయంలో మీరు జిత్తులమారిగా ఉంటారని చెబుతున్నారు. కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే ఇది భవిష్యత్తులో అపారమైన సంపదను, మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది అని చెబుతున్నారు.
కనుబొమ్మ చివర పుట్టుమచ్చ ఉంటే జీవితం సంతోషంగాను, నైపుణ్య వంతంగా ఉంటుందని చెబుతున్నారు. కనురెప్పల లో ఒకదానిపై పుట్టుమచ్చ ఉంటే గొప్పవారు అవుతారని, వారు గొప్ప జీవితాన్ని అనుభవిస్తారని చెబుతున్నారు ఎగువ కనురెప్ప పై పుట్టుమచ్చ ఉండడం కొత్త అవకాశాలను ఇస్తుందని చెబుతున్నారు. దిగువ కనురెప్ప పై పుట్టుమచ్చ ఉంటే మీరు అధికంగా ఖర్చు చేసే వ్యక్తి అని చెబుతున్నారు.
చెవి లోపల మరియు బయట భాగంలో పుట్టుమచ్చతో జన్మించినవారు విలాసవంతమైన జీవితం కలిగి ఉంటారని ఇతరుల కోసం ఖర్చు చేస్తారని చెబుతున్నారు. మీ చుట్టూ ఉన్న వారిని సంతోషపెట్టడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. అంతేకాదు మీ పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే అది మీ బ్యాంకు బ్యాలెన్స్ కు అదృష్టాన్ని తెస్తుందని, మీ జీవితానికి మంచి విజయాన్ని అందిస్తుందని చెబుతున్నారు. కింది పెదవి పై పుట్టుమచ్చ ఉంటే జూదం ఆడడానికి ఇష్టపడతారని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications