కలలో ఇవి కనిపిస్తే మీకు రాజయోగం!!
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు చాలా ముఖ్యమైనవి. కలలు మన భవిష్యత్తుకు సంకేతాలు. కలలకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. కలల గురించి స్వప్న అధ్యాయం అంటూ బృహస్పతి ఒక ప్రత్యేకమైన కలల శాస్త్రాన్ని రాశారని పండితులు చెబుతారు. మనం కనే కలలను బట్టి మన భవిష్యత్తు ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.
రాజయోగం వస్తుందని చెప్పే కలలు
కలలలో మంచి కలలు, చెడు కలలు ఉంటాయి. అయితే ప్రస్తుతం మనం మనకి అదృష్టాన్ని ఇచ్చే, ధనలక్ష్మి కటాక్షాన్ని ఇచ్చే, రాజయోగం పట్టించే కొన్ని కలలను గురించి తెలుసుకుందాం. బృహస్పతి స్వప్న అధ్యాయంలో వెల్లడించిన ఆ కలలో వివరాల్లోకి వెళితే నిద్రిస్తున్నప్పుడు కలలలో చెట్టు ఎక్కినట్టుగా వస్తే వారు ఐశ్వర్యవంతులు అవుతారని వారి పైన లక్ష్మీదేవి కటాక్షం ఉందని బృహస్పతి స్వప్నాధ్యాయంలో చెప్పారు.

కలలో వీటిని ఎక్కినట్టు వస్తే
అంతే కాదు కలలలో ఎద్దును ఎక్కినట్టుగా వచ్చినా లక్ష్మీ కటాక్షం ఉంటుందని చెప్తారు. ఏదైనా కొండను ఎక్కినట్టుగా కల వస్తే కూడా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తామని, ఎటువంటి అసాధ్యమైన పనైనా సుసాధ్యం అవుతుందని చెప్తున్నారు. అంతే కాదు కలలో ఏనుగు ఎక్కినట్టుగా కనిపిస్తే రాజయోగం పడుతుందని చెబుతున్నారు.
కలలో ఇవి వస్తే దీర్ఘాయుష్షు
ఇలాంటి కలలు వస్తే అనుకున్న పనులన్నీ తొందరగా పూర్తవుతాయని, జీవితంలో తొందర్లోనే పదవియోగం కలుగుతుందని చెబుతున్నారు. అధికార పదవులతో పాటు, ప్రమోషన్లు వస్తాయని అంటున్నారు. జీవితంలో మీరు ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ స్వప్నాల అర్థంగా చెబుతున్నారు. అలాగే కలలో ఎవరికైనా ఏడ్చినట్టుగా కనిపిస్తే, కలలో చనిపోయినట్టు కనిపిస్తే వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందని వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కలల వలన ఫలితం వీరికే
కలల్లో దేవతలు కనిపిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. కలలో దేవతలు కనిపించటం జరిగితే పిల్లాపాపలతో వంశం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా బృహస్పతి తన స్వప్న అధ్యాయంలో పేర్కొన్నట్టు పండితులు చెబుతున్నారు. అయితే వాత, పిత్త దోషాలు ఉన్నవారికి, ఒకే విషయం పైన తదేకంగా దృష్టి పెట్టిన వారికి వచ్చే కలలు ఫలించవని, ఎలాంటి ఆలోచన లేకుండా యాదృచ్ఛికంగా వచ్చిన కలలు మాత్రమే ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు పండితులు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications