ఇంట్లో వాస్తు దోషం ఉందనిపిస్తే ఈ ఒక్క పని చేయండి
మన భారతీయ సాంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రం అతి పురాతన శాస్త్రం. కచ్చితంగా నిర్మాణాల సమయంలో వాస్తును చూసే నిర్మాణాలు జరుపుతాం. అయినప్పటికీ కొన్ని కొన్ని లోపాలవల్ల వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి మనం తెలియక చేసిన పనులవల్ల కూడా దోషాలు వస్తుంటాయి. అటువంటి సమయంలో ఆంజనేయస్వామి చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆ ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం.
ఇంట్లో నైరుతి మూలలో పంచముఖి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని ఉంచాలి.
నైరుతి మూల స్థిరత్వాన్ని కలిగిస్తుంది.. శ్రేయస్సునిస్తుంది.
వాస్తు ప్రకారం దేవుళ్ల ఫొటోలను నైరుతి మూలలో పెట్టుకుంటే అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మూల చాలా శుభప్రదం.

పంచముఖి ఆంజనేయస్వామి చిత్రపటం పెట్టిన తర్వాత కుటుంబంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
వాస్తు దోషాల నుంచి విముక్తి కలిగి అందరూ సంతోషంగా ఉంటారు.
హనుమంతుడి చిత్ర పటాన్ని అక్కడ పెట్టే ముందు ఆ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయాలి.
ఆ ప్రదేశంలో గంగా జలం చల్లాలి.
"ఓం హ్రాం హనుమతే నమః" అనే మంత్రాన్ని పఠించాలి.
ప్రతిరోజు మల్లె నూనెతో దీపాన్ని పటం ముందు వెలిగించాలి.
మంగళవారం, శనివారం దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం.
లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి కలసివున్న చిత్రపటాన్ని కూడా ఉంచొచ్చు.
దీనివల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.
ఈ పటాన్ని పూజా స్థలంలో ఈశాన్య దిశలో ఉంచాలి
చివరగా ఒకటి.. ఇంట్లో దేవుడి ఫొటోలు చినిగిపోయినవి, పగిలిపోయినవి ఉంటే వాటిని వెంటనే తీసుకువెళ్లి నదిలో కలపాలి. లేదంటే వాస్తు దోషాలు పెరుగుతాయే కానీ తగ్గవు. వాటిని నదిలో వదిలిపెట్టినప్పుడు చేసిన తప్పుకు క్షమాపణ కోరాలి. బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ సమీపంలో కూడా దేవుళ్ల ఫొటోలు ఉంచకూడదు.












Click it and Unblock the Notifications