లక్ష్మీ దేవి కటాక్షం కావాలంటే చీమలకు ఆ ఆహారం పెట్టక తప్పదా..?
ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సకల జీవులకూ అధిపతి అయిన మనిషికి.. వాటిని కాపాడే బాధ్యత కూడా ఉంది. చుట్టూ ఉన్న ప్రాణులు అన్నీ క్షేమంగా ఉంటేనే.. మనుషులు కూడా క్షేమంగా ఉంటారు. అందుకే ఎవరైతే ప్రకృతిని కాపాడతారో వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ భావిస్తుంటారు. సృష్టికి మేలు చేసేవారి పట్ల అమ్మవారు అత్యంత ప్రేమ కురిపిస్తారని వేద పండితులు సైతం చెబుతున్నారు. ఇక జీవుల్లో చిన్నవే అయినా బాగా కష్టపడే జీవులు చీమలు. చీమలు పెట్టేంత పెద్ద పుట్టలు ఈ ప్రపంచంలో మరే జీవీ పెట్టలేదు. నిరంతరం పనిచేస్తూనే ఉంటూ ఆహారాన్ని పోగేసి.. భూమి లోపల దాస్తాయి.

అలానే చీమలు దాచే విత్తనాలు సైతం మొలకెత్తి వృక్ష జాతి కూడా పెరుగుతుంది. మన పురాణాల్లో చీమలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే వాటికి ఆహారం పెట్టడాన్ని అత్యంత పవిత్రమైన కార్యక్రమంగా సంప్రదాయాలు చెబుతున్నాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే చీమలకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
చీమలకు పెట్టాల్సిన 5 రకాల ఆహారాలు..
తేనె..
చీమలకు ఇష్టమైన తేనెను ఆహారంగా పెడితే ఇంట్లో సంబంధాలు బలపడి సుఖ సంతోషాలు, సంపద కలుగుతుందని చెబుతున్నారు.
బెల్లం..
బెల్లంని చీమలకు పెడితే ఆర్థిక కష్టాలు తీరి అభివృద్ధి, సంక్షేమం లభిస్తుంది.
పంచదార..
చీమలకు పంచదార పెడితే ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.
గోధుమ పిండి..
చీమలకు గోధుమపిండిని ఆహారంగా పెడితే అప్పులు తీరతాయని అంటున్నారు.
బియ్యం పిండి..
చీమలకు బియ్యం పిండి ఆహారంగా పెడితే ఆర్థికంగా వృద్ధి లభిస్తుంది.
లక్ష్మీ దేవి అమ్మవారికి ఇష్టమైన రోజు అయిన శుక్రవారం నాడు.. ఈ ఆహారాలను ఓ విస్తరాకులో కొద్దికొద్దిగా వేసి చీమల పుట్ట దగ్గర పెట్టాలి. ఆలయంలో లేదా పెరట్లో, గార్డెన్‌లో కూడా పెట్టవచ్చు. శుక్రవారం కుదరకపోతే బుధవారం, శనివారం కూడా ఈ ఆహారం చీమలకు పెట్టవచ్చు. ఈ రకంగా చేస్తే వారి ఇంట చెడు శక్తులు తొలగిపోయీ సిరిసంపదలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications