2025లో వీరిని పట్టుకున్న ఏలినాటి శని.. ఏడున్నరేళ్ళు ముప్పతిప్పలే, పరిహారాలిలా!
2025 సంవత్సరంలో ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారుతున్నాయి . ముఖ్యంగా వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం కారణంగా ద్వాదశ రాశుల వారి గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయి. సాక్షాత్తు పరమశివుడికి శని ప్రభావం తప్ప లేదని చెబుతారు. అటువంటి శని తలచుకుంటే బిక్షగాడిని కోటీశ్వరుడిని, కోటీశ్వరుడిని బిక్షగాడిని చేయగలడు.
శని సంచారం సాగుతుందిలా
కర్మలకు అధిపతిగా, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే శని చాలా నిదానంగా సంచారం చేస్తాడు. శని ఒకరాశి నుండి మరొక రాశికి సంచారం చేయటానికి దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. శని ప్రతీ రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి, మొత్తం 12 రాశులను పూర్తి చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది.

ఈ రాశులవారిపై ఏలినాటి శని ప్రభావం
2025 సంవత్సరంలో కుంభ రాశి నుంచి మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. మీన రాశికి అధిపతి బృహస్పతి. ఇక బృహస్పతి రాశిలో శని సంచారం అనేక రాశుల వారి జీవితాల్లో మార్పులు తెస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాలలో కష్టాలకు కారణమవుతుంది. కొన్ని రాశులవారు ఏలినాటి శని కారణంగా చుక్కలు చూస్తారు.
మేషరాశి
మేష రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు రాబోతున్నాయి. వీరికి మార్చి నెలలో ఏలినాటి శని ప్రారంభమైంది. ఇది 2032వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. మొత్తం మూడు దశల్లో శని మేషరాశి జాతకుల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. మేషరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటారు.
ఏలినాటి శనితో మేషరాశి వారికి మానసిక ఆందోళన
పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వీరిని బాధిస్తాయి. శని కారణంగా వస్తున్న ఏలినాటి శని ప్రభావంతో మానసిక ఆందోళన కలుగుతుంది. అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఈ సంవత్సరం నుంచి మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావంతో మేషరాశి జాతకులు పడరాని కష్టాలు పడనున్నారు.
కుంభరాశి
ఇక కుంభరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావాన్ని చూస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులు ఊహించని విధంగా ఖర్చులు పెడతారు. అస్సలు ప్రశాంతంగా జీవించలేరు.ఏలినాటి శని కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుంభ రాశి విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరచలేరు.
కుంభరాశి వారికి కష్టకాలం
చెడు స్నేహాలు, చెడు అలవాట్ల కారణంగా దంపతుల మధ్య రోజు గొడవలు జరుగుతాయి. మీ మధ్యలో మూడో వ్యక్తి ప్రేమ పేరుతో ఎంటర్ కావడంతో మోసపోయే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళిన వారు ఉద్యోగాలు రాక తిరిగి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కుంభ రాశి వారు ఈ సంవత్సరం కేసులలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది వీరికి నిజంగా కష్ట కాలంగా చెప్పే సంవత్సరం.
మీనరాశి
మీనరాశి జాతకులు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావాన్ని చూడబోతున్నారు. అయితే మీన రాశిలోకి శని ప్రవేశించే సమయానికి మీనరాశిలో ఏలినాటి శని రెండవ దశ ప్రారంభమవుతుంది. ఇక ఈ దశ మీనరాశి జాతకులకు అత్యంత ఇబ్బందికరంగాను, సమస్యాత్మకంగానూ ఉండే అవకాశం ఉంది. రెండు, మూడు దశలను చూడవలసి ఉన్న మీనరాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కష్టాలతో మీనరాశి జాతకుల జీవితం
మీనరాశి జాతకులకు ఈ సమయం చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది. ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి నష్టాలు, కష్టాలు ఉంటాయి. మీనరాశి జాతకులు శని సడే సతి యొక్క ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది.
ఈ రాశుల వారు జాగ్రత్త
అయితే ఏలినాటి శని ప్రభావాన్ని చూస్తున్న మేష, కుంభ, మీన రాశుల వారు మొత్తం మూడు దశలకు తగ్గట్టు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఏలినాటి శని ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలను కూడా చేయవలసి ఉంటుంది. శని గ్రహ పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు సహాయం చేయడం కూడా ఏలినాటి శని ప్రతికూల ఫలితాల నుండి కాపాడుతుంది.
ఏలినాటి శని పరిహారాలు
ఏలినాటి శని తో ఇబ్బంది పడేవారు ఏలినాటి శని నుంచి బయటపడడం కోసం కొన్ని పరిహారాలను చేస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు. శనికి ఇష్టమైన పనులను చేస్తే ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది . శనికి శివారాధన అంటే అత్యంత ప్రీతి. కనుక ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ప్రతినిత్యం శివలింగానికి జలాభిషేకం చేసి శివారాధన చేస్తే శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇలా చేస్తే ఏలినాటి శని నుండి విముక్తి
అంతేకాదు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఏలినాటి శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక 108 సార్లు ప్రతినిత్యం పరమశివుని మహామృత్యుంజయ మంత్రాన్ని దీక్షతో భక్తిశ్రద్ధలతో జపిస్తే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. శని మంత్రాన్ని జపిస్తే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది.
ఈ పనులతో ఏలినాటి శని నుండి ఉపశమనం
ఇక ప్రతి శనివారం వేకువజామున నిద్రలేచి శివాలయంలో శివుడికి పంచామృతాలతో పూజలు చేసి, శని దేవుడికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల తోటి పూజిస్తే శని శాంతించి కరుణిస్తాడు. ఇక శనివారం రోజు అన్నదానం, వస్త్రదానం, గొడుగు, చెప్పులు వంటి వాటిని దానం చేసి, శని దేవుడిని ప్రార్థించడం వల్ల కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications