2025లో సిరి సంపదలు, సంతోషాలన్నీ మీవే.. రాసిచ్చిన రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా చెప్తారు. వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించరు. కానీ ఇవి ముఖ్య గ్రహాల మాదిరిగానే తమ ప్రభావాన్ని అన్ని రాశుల వారిపై చూపిస్తాయి. రాహు గ్రహానికి చెడు చేసే గ్రహం గానూ, క్రూర గ్రహంగానూ చెప్పే రాహు గ్రహం మంచి స్థానంలో ఉంటే మంచిని కూడా చేస్తుంది. ఊహించని సంతోషాలకు కారణం అవుతుంది.
రాహు సంచారం
రాహువు ఎప్పుడూ తిరోగమనములో సంచారం చేసే గ్రహం. ప్రస్తుతం రాహువు బృహస్పతి పాలించే మీన రాశిలో ఉన్నాడు . కుంభరాశి లోకి రాహువు 2025 మే 18 వ తేదీన ప్రవేశించబోతున్నాడు. కుంభరాశిలోకి రాహువు సంచారం కారణంగా కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మరి రాహువు అదృష్టాన్ని ఇచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించడం మేష రాశి వారికి కలిసొస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఏం చేసినా అదృష్టం కలిసొస్తుంది. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వర్తక వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నవారి సమస్యలు పరిష్కారమై వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. మేష రాశి జాతకులు అసంపూర్ణంగా ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
కన్యారాశి
కుంభరాశిలో రాహువు సంచారం కారణంగా కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.వీరి జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఈ సమయంలో పరిష్కరిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి కూడా మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ సమయం విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి శుభ సమయం. రాహువు దయ వలన 2025 సంవత్సరంలో చాలా మంచి ప్రయోజనాలను కన్యారాశి జాతకులు పొందబోతున్నారు.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారి కోరికలను రాహువు 2025 సంవత్సరంలో నెరవేర్చనున్నాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో విజయాలను సాధిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి శుభ సమయం. ఆర్ధికంగా పురోగతి సాధించే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications