జులైలో ప్రధాన గ్రహాల సంచారంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టేది వీరే!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెలకు దేనికదే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది .అలాగే జూలై మాసానికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. జూలై మాసంలో ముఖ్య గ్రహాల సంచారం జరగబోతుంది . జూలై మాసంలో శుక్రుడు, కుజుడు, సూర్యుడు, చంద్రుడు వివిధ రాశులలోకి సంచారం చేస్తూ, ఆయా రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. అదే సమయంలో బుధుడు కూడా రాశిమార్పు చేస్తూ తన ప్రభావాన్ని చూపించబోతున్నాడు.

జులై మాసంలో గ్రహాల సంచారం
ఇక శని దేవుడు తిరోగమనంలో సంచరిస్తూ వివిధ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మిధున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు సంచారం సాగిస్తూ ద్వాదశ రాశుల వారిని శాసిస్తున్నారు. ఇక జూలై మాసంలో జరిగే ముఖ్య గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

In July fortune of these zodiac signs will shine with the transit of major planets

వృషభ రాశి
వృషభరాశి జాతకులకు జూలై మాసంలో ప్రధాన గ్రహాల సంచారం కారణంగా చాలా ప్రయోజనం చేకూరుతుంది. వీరు కెరీర్లో ఊహించని మార్పులు చూస్తారు. వృషభరాశివారు ప్రమోషన్లు పొందుతారు. జూలై మాసంలో వృషభరాశి జాతకులు ముఖ్యమైన పనులను చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేసే ప్రతి పనిని బాధ్యతతో చేస్తారు. వృషభరాశి జాతకులు ఉద్యోగాలు చేసేవారు ఇంక్రిమెంట్లు ఉన్న పొందే అవకాశం కూడా ఉంది.

కన్య రాశి
జూలై మాసం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఏ పని చేసిన వీరికి ఈ సమయంలో అదృష్ట లక్ష్మి వరిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గొప్ప విజయాలను సాధిస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కన్యరాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఆర్థికంగాను పురోగతిని సాధించి అన్ని రంగాలలోనూ దూసుకుపోతారు.

మిధున రాశి
మిధున రాశి జాతకులు జూలై మాసంలో అనేక సానుకూల ఫలితాలను పొందనున్నారు. ఈ సమయంలో మిధున రాశి జాతకులకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి ఇన్వెస్టర్లు దొరుకుతారు. ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. జీవితంలో ఉన్న విభేదాలు తొలగిపోయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బులకు కొదవ లేకుండా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మిధున రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+