నవంబర్ మాసంలో వీరికి ధనలక్ష్మీ యోగం అనుగ్రహించిన శుక్రుడు!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలలో మార్పులు వస్తాయి. జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. అటువంటి శుక్రుడి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, విలాసాలు లభిస్తాయి. శుక్రుడి శుభ దృష్టి కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు.
నవంబర్ లో ధనుస్సు రాశిలోకి శుక్రుడు
నవంబర్ మాసంలో శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచరించబోతున్నాడు. నవంబర్ 16వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు శుక్రుడు ధనుస్సు రాశి లోకి వెళతాడు. ఆపై డిసెంబర్ 10 ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ధనస్సు రాశిలో సంచరిస్తాడు. ధనుస్సు రాశిలో శుక్ర సంచార ప్రభావంతో మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది .మరి శుక్రుని ఆశీస్సులు పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ సమయం ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది లాభాలను ఇచ్చే సమయం. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా సానుకూలత ఉంటుంది.
సింహరాశి
ధనస్సురాశిలో శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. సింహ రాశి వారికి ఈ సమయంలో విలాసవంతమైన జీవితం వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి సరిపడా డబ్బు ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఇది సింహరాశి జాతకులకు అదృష్ట కాలం.
తులారాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి సంపదలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది సరైన సమయం. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇప్పుడు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి.
మీనరాశి
ధనస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సామాజికంగా మీన రాశి వారికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయం మీన రాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications