సెప్టెంబర్లో అద్భుత రాజయోగం ఇస్తుంది వీరికి సంపదల వర్షం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి. ఇవి అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే సెప్టెంబర్ నెలలో గ్రహాలు రాకుమారుడు అయిన బుధుడు తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

బుధ సంచారం.. భద్ర మహాపురుష రాజయోగం
బుధుడు తిరోగమన స్థితిలో కన్య రాశిలోకి ప్రవేశించడం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఏడాది తర్వాత సెప్టెంబర్ 9న బుధుడి కారణంగా కన్యరాశిలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెలలో బుధుడి సంచారం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగంతో లబ్ధి పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

In september month Bhadra mahapurush Raja yoga gives wealth to these zodiac signs

సింహరాశి
దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన లాభాలను పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా సింహరాశి వారికి విజయం వరిస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు.

ధనుస్సు రాశి
ఏడాది తర్వాత బుధుడు సొంతరాశి అయిన కన్యారాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగం వీరికి శుభాలనిస్తుంది. ఈ సమయంలో ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలువుతాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.

కన్యారాశి
దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడే భద్ర మహాపురుష రాజయోగం కారణంగా కన్యారాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు బలోపేతం అవుతారు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. కెరీర్లో గొప్పగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+