ఈ రాశులవారు బంగారం ధరిస్తే మంచిది కాదు.. మీ రాశి ఉందా? తెలుసుకోండి!!
బంగారం అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే ఉంటుంది. అయితే చాలా మంది బంగారం విషయంలో నిరాశ చెందే విషయం ఇప్పుడు మీకు చెప్తున్నాం. చాలా మందికి బంగారం కలిసిరాదు. బంగారం ధరించటం వల్ల వారి జీవితంలో ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
కొన్ని రాశులలో జన్మించిన వారికి బంగారం ధరించడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అసలు ఏ రాశి వారు బంగారం ధరించకూడదు? బంగారం ధరిస్తే ఎవరికి నష్టాలు ఎక్కువగా వస్తాయి? బంగారం ధరించటం కూడా జీవితంపై ప్రభావం చూపిస్తుందా? వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మొత్తం 12 రాశులలో కొన్ని రాశుల వారికి బంగారం కలిసిరాదు. అది వారికి కూడా తెలీదు. అటువంటి వారు బంగారం ధరించవచ్చా లేదా అన్న అవగాహన కలిగి ఉండటం అవసరం. ద్వాదశ రాశులలో వృషభ రాశి వారికి బంగారాన్ని ధరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వృషభ రాశి వారు బంగారాన్ని ధరించడం వల్ల వారికి నష్టం జరుగుతుంది.
మిధున రాశి వారికి కూడా బంగారాన్ని ధరించడం మంచిది కాదు. మిధున రాశి జాతకులు బంగారం ధరించడం వల్ల వారికి హాని కలుగుతుంది. అంతేకాదు ఇంట్లో బృహస్పతి దోష స్థానం ఉన్నవారికి బంగారం కొనడం లేదా బంగారాన్ని ధరించడం ఏమాత్రం లాభదాయకం కాదని చెబుతున్నారు. తెలిసీ తెలియక వారు బంగారాన్ని కొనుగోలు చేసినా అది వారికి మానసిక అశాంతిని కలిగిస్తుంది.
కన్యా రాశి వారు పొరపాటున కూడా బంగారాన్ని ధరించకూడదు. కన్యారాశి జాతకులు బంగారాన్ని ధరించడం వల్ల జీవితంలో కీర్తి, ప్రతిష్టలను కోల్పోతారు. కాబట్టి కన్యారాశి వారు బంగారాన్ని ధరించకూడదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కుంభ రాశి వారు బంగారాన్ని ధరించకూడదు. కుంభ రాశి వారు బంగారాన్ని ధరించడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వారి జీవితం దుఃఖసాగరంగా మారుతుంది. ఎప్పుడూ వారు మనస్థాపంతో జీవించే పరిస్థితి ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications