పుత్రదా ఏకాదశి నుండి వీరికి జాక్ పాట్ మొదలైంది... మీరున్నారా?

ఆగస్టు మాసం అందునా శ్రావణమాసం, ఈ మాసంలో అనేక విశేషమైన దినాలు ద్వాదశ రాశుల వారికి శుభాలను ఇస్తాయి. శ్రావణమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. నేడు పుత్రదా ఏకాదశి. ఈ ఏకాదశి ఆగస్టు 4వ తేదీ ఉదయం 11.41 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 1.12 నిమిషాల వరకు ఉంటుంది.

పుత్రదా ఏకాదశి నాడు అనేక శుభ యోగాలు
అయితే హిందూ సంప్రదాయంలో ఉదయం తిధిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి పుత్రదా ఏకాదశి ఆగస్టు 5వ తేదీనే అని చెబుతారు. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని పూజిస్తారో వారికి శుభ ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇక పుత్రదా ఏకాదశి నాడు అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి ఈరోజు సిద్ధ యోగం, రవి యోగం ఏర్పడ్డాయి.

jackpot has started for these zodiac signs since Putrada Ekadashi Are you in this

నేడు మంగళ గౌరీ దేవి వ్రతంతో పాటు ఈ యోగాలు
అంతేకాకుండా ఈరోజు మంగళవారం కావడంతో మహిళలందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే మంగళ గౌరీ దేవి వ్రతం కూడా ఈరోజు వచ్చింది. పుత్రదా ఏకాదశి నాడు ఏర్పడిన శుభ యోగాల కారణంగా నేటి నుండి లబ్ది పొందే విశేష రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి పుత్రదా ఏకాదశి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు ఏదైనా పనిని మొదలు పెడితే అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి పుత్రదా ఏకాదశి నుండి శుభ సమయం ప్రారంభమవుతుంది.

మిధున రాశి
మిధున రాశి వారికి కూడా పుత్రదా ఏకాదశి సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ ఏకాదశి అన్ని విధాలా కలిసి వస్తుంది. మిధున రాశి జాతకులకు ఈ సమయంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మిధున రాశి వారు సంతోషాన్ని ఇచ్చే వ్యక్తులను కలుస్తారు.

ధనుస్సు రాశి
పుత్రద ఏకాదశి ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది .ఈ సమయంలో ధనుస్సు రాశి వారు వారి బాధ్యతలను పూర్తి చేస్తారు. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఏ పని చేసిన మంచి ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుంభరాశి
పుత్రదా ఏకాదశి కుంభరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు కెరీర్ లో ఊహించని మార్పులు చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. ఈ సమయంలో వీరికి అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+