horoscope today: నేడు చతుర్గ్రాహి యోగంతో వీరికి నాలుగు చేతులా సంపాదన!
జ్యోతిష్య శాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో వివిధ గ్రహాలతో సంయోగం జరుపుతూ వివిధ యోగాలను ఏర్పరుస్తాయి. జనవరి 8వ తారీఖు మకర రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ చతుర్గ్రాహి యోగం అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. నేడు 12 రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
మేషం
మేషరాశి వారికి పనుల్లో కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. నేడు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.

వృషభం
వృషభరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథునం
మిధున రాశి జాతకులకు మిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. వీరికి ఈ సమయంలో ప్రయాణాలు లాభిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి ఖర్చులు అదుపులో పెట్టాలి.
సింహం
సింహరాశి వారికి గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులతో వ్యవహారాల్లో సంయమనం పాటించాలి.
కన్య
కన్యా రాశి జాతకులకు పని ఒత్తిడి పెరిగినా ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. నేడు వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తుల
తులారాశి జాతకులకు దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. అనవసర వాదనలు దూరం చేయాలి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. రుణాల విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులైన విద్యార్థులకు అనుకూల సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. నేడు వీరు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం
మకర రాశి జాతకులకు ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. పెద్దల సలహాలు కలిసి వస్తాయి. నేడు వీరికి ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది.
కుంభం
కుంభరాశి వారికి సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. వీరికి ఈ సమయంలో మిత్రుల ద్వారా లాభం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
మీనం
మీనరాశి జాతకులకు మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశముంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications