శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడే జయంతి యోగం.. మూడు రాశుల వారి పంట పండినట్టే!!

శ్రీకృష్ణ జన్మాష్టమి... కృష్ణ భగవానుని భక్తులు అత్యంత భక్తి భావంతో పూజించే పర్వదినం. బాలకృష్ణయ్య ముద్దు రూపాన్ని పూజించే శుభదినం. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత పవిత్రమైన జయంతి యోగాతో పాటు వస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ ఆరవ తేదీన అర్ధరాత్రి అష్టమి తిథిగా, రోహిణి నక్షత్ర యుక్తంగా ఉన్న సమయంలో జయంతి యోగం ఏర్పడుతుంది.

ఈ జయంతి యోగం కారణంగా మూడు రాశుల వారు శ్రీకృష్ణుని సంపూర్ణ ఆశీర్వాదాలను పొందుతారు. జయంతి యోగం సమయంలో శ్రీకృష్ణుని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.జయంతి యోగం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి జాతకులకు కృష్ణుని కటాక్షం తెలంగాణ లభిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క అనంతమైన ఆశీర్వాదాలను వారు పొందుతారు.

Jayanti yogam on Sri Krishna Janmashtami .. these zodiac signs are very lucky!!

ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ సమయంలో సత్ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు నశించి, వారు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రతికూలతలను అధిగమిస్తారు. చెడు చేసే వ్యక్తుల పైన విజయం సాధిస్తారు. కృష్ణుడు వారి ప్రతి పనిలోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. వృషభ రాశి వారికి కృష్ణుడు సంపదను, శ్రేయస్సును, వృద్ధిని విజయాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు.

కర్కాటక రాశి వారికి జయంతి యోగం లబ్ధిని చేకూరుస్తుంది. కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఆరోగ్యంతో పాటు అన్ని కోరికలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారు రాధాకృష్ణుల రూపాన్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది .ఈ సమయంలో వారి కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి.

సింహ రాశి వారికి జయంతి యోగం వల్ల మేలు జరుగుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో మరింత శక్తివంతమైన పురోభివృద్ధి యోగాలు ఏర్పడతాయి. బాలకృష్ణయ్య వారికి అన్ని ప్రయత్నాలలో ను విజయాన్ని ఆశీర్వదిస్తాడు. సంతోషాన్ని, శ్రేయస్సును అందిస్తాడు. ఈ సమయంలో చేసే అనేక పనుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి జాతకులకు ఈ సమయం చాలా ఆశాజనకంగా ఉంటుంది. కృష్ణుని కరుణ వీరిపై చాలా ప్రత్యేకంగా ఉటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+