శుభ గ్రహాల కలయిక.. జులై 12నుండి ఈ రాశులకు ధనలక్ష్మీ కటాక్షం
వేద జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతి, కుజుడు రెండు శుభానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. ఏడాదికి ఒకసారి గురు గ్రహం తన రాశిని మార్చుకుంటుంది. ప్రస్తుతం వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తోంది. ఈ ఏడాది మొత్తం వృషభ రాశి లోనే గురు గ్రహ సంచారం ఉంటుంది.
కుజ బృహస్పతుల కలయిక
ఇక కుజుడు 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. కుజుడు త్వరలో బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి వెళ్ళనున్నాడు. జూలై 12వ తేదీన రాత్రి 7 గంటల 12 నిమిషాలకు కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించడం, ఇక కుజ, బృహస్పతుల కలయిక కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. వారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి
బృహస్పతి, కుజుల కలయిక మేషరాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. బృహస్పతి అనుగ్రహంతో ఈ సమయంలో సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా సాగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజుడు గురుడు కలయిక కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. 45 రోజులపాటు మీరు సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ సమయంలో మీరు ఏ పనులు చేసిన విజయం వరిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు కుజ గురు గ్రహాల కలయిక లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగం చేసే వారి పైన గురుడు కుజుడు కలయిక ప్రభావం చూపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో ఆదాయానికి సంబంధించి నూతన మార్గాలు తెరుచుకుంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications