నవంబర్ 28వరకు వీరికి ఐశ్వర్యాన్ని అనుగ్రహించిన బృహస్పతి!
దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 20వ తేదీన బృహస్పతి మృగశిర నక్షత్రంలో ప్రవేశించి నవంబర్ 28 వరకు బృహస్పతి ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.
అంగారకుడి నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో బృహస్పతి
దేవ గురువు, గ్రహాలలో ముఖ్యమైన గ్రహం అయిన బృహస్పతి అంగారకుడి నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలు కలుగుతున్నాయి. నవంబర్ 28వ తేదీ వరకు శుభ ఫలితాలను పొందే, ధనలక్ష్మీ కతాక్షాన్ని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభరాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృషభరాశి వారి ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం చేసేవారు శుభవార్తలను వింటారు. ఈ సమయం వృషభరాశి వారికి శుభసమయం .నవంబర్ నెల వరకు వీరికి తిరిగే ఉండదు.
కన్యారాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కారణంగా కన్య రాశి వారికి కలిసి వస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. కన్యా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఈ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.
కర్కాటక రాశి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి నవంబర్ నెల వరకు అదృష్టాన్ని ప్రకాశించేలా చేస్తుంది. వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. పనికి తగిన ప్రశంసలు కూడా అందుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇది పురోగతి సాధించే సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. ఏ రంగంలో పని చేసినా ఈ సమయం వీరికి లక్ష్మీదేవి కటాక్షించే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications