ఈ రాశులవారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవన్న బృహస్పతి.. ఎప్పటివరకంటే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా బృహస్పతికి స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం నుంచి బృహస్పతి సంచారానికి ఒక గొప్ప ప్రభావం ఉంది . జూన్ మాసంలో బృహస్పతి మిధున రాశిలో దహనం అయ్యాడు.
బృహస్పతి దహనం.. ప్రతికూలతలు ఎదుర్కొనే రాశులు
జూలై 9వ తేదీన బృహస్పతి మిథునరాశిలో ఉదయించబోతున్నాడు. అయితే జూలై 9వ తేదీ వరకు బృహస్పతి దహనం కారణంగా కొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూస్తున్నారు. బృహస్పతి దహనంతో ఇబ్బందులు ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యారాశి
బృహస్పతి దహనం కారణంగా కన్యారాశి వారు తమ జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కన్యారాశి ఉద్యోగస్తులు సీనియర్లతో అసంతృప్తిని ఎదుర్కొంటారు. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలం కాదు. జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్వాములు ఇబ్బందులను ఎదుర్కొంటారు . ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సమయం కాదు. మీ నైపుణ్యాలకు తగిన ఉద్యోగం దొరకదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
సింహరాశి
జులై 9వ తేదీ వరకు బృహస్పతి దహనం కారణంగా సింహరాశి జాతకులు పనిచేసే చోట సింహరాశి జాతకులు కష్టపడాల్సి వస్తుంది. శాంతి, ఆనందం దెబ్బ తింటాయి . వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి రాదు. ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడాన్ని నియంత్రించుకోవాలి. ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.
వృశ్చిక రాశి
జూలై 9 వ తేదీ వరకు బృహస్పతి దహనం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే పరిస్థితి ఉంది. వృత్తిపరమైన ఆసక్తులకు అనుగుణంగా తగిన నిర్ణయాలను తీసుకోవాలి. కుటుంబంలో ఇబ్బందులు ఉండవచ్చు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయాలంటే పని జీవితంలో అన్ని రకాల ఇబ్బందులను నివారించడానికి కష్టపడాలి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications