Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వృషభరాశిలో బృహస్పతి దహనం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం; జాగ్రత్త

వృషభ రాశిలో బృహస్పతి దహనం నేడు సంభవిస్తుంది. వృషభ రాశిలో ఉన్న సూర్యుడిని బృహస్పతి సమీపిస్తున్నప్పుడు బృహస్పతి దహనం చోటు చేసుకుంటుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వారి జీవితాలలో వినాశనం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం మనం ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం వృషభ రాశి జాతకులకు ఆకస్మిక ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. కెరీర్ కు సంబంధించిన విషయాలలో కూడా అసంతృప్తి చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా గొంతు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. వర్తక వ్యాపారాలు నష్టాలను అందిస్తాయి. జీవిత భాగస్వామితో వాదనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి.. ఈ సమయంలో జాగ్రత్త, శ్రద్ధ రెండు అవసరం.

Jupiter combust into Taurus Risk of sudden financial losses for these signs Be careful

మిధున రాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం కారణంగా మిధునరాశి జాతకులకు ఆకస్మిక నష్టాల ప్రమాదం ఉంది. ఖర్చులు విపరీతంగా ఈ సమయంలో పెరుగుతాయి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి. బలహీనమైన రోగనిరోధక పనితీరును మీ శరీరం ఈ సమయంలో కనబరుస్తుంది.

సింహరాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం కారణంగా సింహరాశి జాతకులు ప్రతికూల ప్రభావాలను చూస్తారు. కెరీర్ లో ఆందోళనలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆర్థిక పరిస్థితులు ప్రభావితమవుతాయి. భాగస్వామితో మనస్పర్థలు వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త

వృశ్చిక రాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం వృశ్చిక రాశి వారి జీవితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో వీరు వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు . ఈ సమయంలో కుటుంబ వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం అవసరం.

ధనుస్సు రాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం కారణంగా ధనుస్సు రాశి వారు వారి జీవన ప్రమాణంలో హెచ్చుతగ్గులను అనుభవించవచ్చు. ఇది హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. సవాళ్లను ఎదుర్కోవచ్చు. వ్యాపారాలలో నష్టాలను చూడవచ్చు. ఉద్యోగాలలో మార్పులను కూడా చూడాల్సి రావచ్చు. వ్యక్తిగత సంబంధాలలో, వ్యాపార, జీవిత భాగస్వామితో విభేదాలను కూడా చూడవచ్చు. ఆరోగ్యపరంగా బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా గొంతు ఇన్ఫెక్షన్లు రావచ్చు.

కుంభరాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం కుంభ రాశి జాతకుల ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాన్ని కలిగించవచ్చు. కెరీర్లో మార్పులు ఉండవచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యుల మధ్య అపార్ధాల వల్ల ఘర్షణలకు దారి తీయవచ్చు. ఈ సమయంలో మానసికంగా ఒత్తిడి పెరిగి సమస్యలకు కూడా కారణం కావచ్చు.

మీన రాశి
వృషభ రాశిలో బృహస్పతి దహనం కారణంగా మీన రాశి జాతకులకు కెరీర్ పరంగా ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగ ఒత్తిడి మరియు అసంతృప్తిని ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామితో అవగాహన లోపం కారణంగా వ్యక్తిగత సంబంధాలు దెబ్బ తినవచ్చు. ఈ సమయంలో జీర్ణ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడవచ్చు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+