రాసిపెట్టుకోండి.. ఫిబ్రవరి 4నుండి వీరికి అఖండ ధనయోగం తధ్యమన్న బృహస్పతి!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ముఖ్యంగా గ్రహాలన్నిటిలోనూ గురు గ్రహం యొక్క ఆశీర్వాదం ఉంటే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళతారు. బృహస్పతి మన జీవితం పైన ఒక మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. గురువు అనుకూలమైన స్థితిలో లేకపోతే జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది.
ఫిబ్రవరి 4నబృహస్పతి ప్రత్యక్షం
ఫిబ్రవరి 4వ తేదీన గురు భగవానుడు 119 రోజుల తర్వాత ప్రత్యక్షం కాబోతున్నాడు. గురు భగవానుడు ప్రత్యక్షం కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల ఫలితాలకు కారణమవుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్న గురువు తన తిరోగమనాన్ని ముగించి ఫిబ్రవరి 4 2025న మధ్యాహ్నం ఒంటిగంట 46 నిమిషాలకు ప్రత్యక్షంగా మారుతుండడం రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది.

మేషరాశి
2025లో మేషరాశి వారికి బృహస్పతి ప్రత్యక్షసంచారం కారణంగా గొప్ప ప్రయోజనాలు వస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారి సంపద పెరుగుతుంది. బృహస్పతి మేషరాశిలో ఆర్థికస్థితిని నియంత్రించే రెండవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఊహించని ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ప్రయోజనాలతో పాటు ఈ సమయంలో ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు.
కన్యా రాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం కారణంగా కన్యరాశి జాతకులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. కన్యారాశిలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ప్రత్యక్షంగా మారబోతున్నాడు కాబట్టి ఇది వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారుల నుండి మెప్పు లభిస్తుంది. ఈ సమయంలో గొప్ప విజయాలను అందుకుంటారు. ప్రేమజీవితం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సమయంలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
బృహస్పతి ప్రత్యక్ష సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల మార్పులను చూస్తారు. బృహస్పతి వృశ్చిక రాశిలో ఐదవ ఇంటిని పాలించడంతో పాటు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాలలో విజయాలకు కారణంగా మారుతుంది. ఈ సమయంలో పెండింగ్ పెట్టిన పనులు పూర్తవుతాయి. కెరీర్ పరంగా వృద్ధి లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు పొందుతారు. ఇది వృశ్చిక రాశి వారికి లబ్ధి చేకూర్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications