బృహస్పతి నక్షత్ర గోచారం.. ఆగస్ట్ 20నుండి మూడునెలలు వీరికి కుబేరయోగం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవగరువుగా పిలిచే బృహస్పతి ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశి లోనే సంచరిస్తున్నాడు. అయితే బృహస్పతి నక్షత్రాన్ని మారుస్తూ ప్రయాణం చేస్తున్నాడు. ఆగస్టు 20వ తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి
నవంబర్ 28 2024 వరకు బృహస్పతి మృగశిర నక్షత్రంలోనే కొనసాగుతాడు. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. బృహస్పతి సంచారం ఏ రాశి వారికి శుభాలను చేకూరుస్తుందో, ఎవరికి బృహస్పతి కటాక్షం సిరులను కురిపిస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jupiter nakshatra gochar in to mrugasira these zodiac signs will get weath from august 20th

మేష రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం మేష రాశి వారికి శుభ పరిణామాలను చేకూరుస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలలో లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయమని చెప్పొచ్చు.

వృషభరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుస్తుంది. వృషభరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగివస్తుంది. పాత పెట్టబడలు వృషభ రాశి వారికి మంచి లాభాలను ఇస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లబ్ధిని పొందుతారు. ఆర్థికంగా ఈ సమయంలో వృషభ రాశి వారు బలంగా ఉంటారు.

కన్యారాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కన్యా రాశి వారికి విశేషమైన లబ్ధిని చేకూరుస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పూర్వీకుల నుండి ఆస్తులు ద్వారా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం ధనుస్సు రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+